తెలుగు ఇజం = మన భాష + మన నైజం

దాశరథి కృష్ణమాచార్యులు

Daasarathi Krishnamacharyulu

TeluguISM Quiz - Daasarathi Krishnamacharyulu
0 467

Daasarathi Krishnamacharyulu : దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 – నవంబర్ 5, 1987) తెలంగాణకు చెందిన వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది.

ఈయన కవి , రచయత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. పలు సినిమాలకు గేయరచయితగా పనిచేశాడు.

బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు.

ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.

ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్‌స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు.

 

More about Daasarathi Krishnamacharyulu

 

దాశరథి కృష్ణమాచార్యులు క్విజ్

0%
1 votes, 5 avg
23

Quiz : దాశరథి కృష్ణమాచార్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Daasarathi Krishnamacharyulu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి ?

2. దాశరథి కృష్ణమాచార్యులు ఎప్పుడు జన్మించారు?

3. తిమిరంలో సమరం జరిపిన బ్రతుకే అమరం అన్న కవి ?

4. దాశరథి కృష్ణమాచార్యులు కవితా పుష్పకం ఎవరికి అంకితం ఇచ్చారు ?

5. దాశరథి కృష్ణమాచార్యులు విశాలాంధ్ర కోరుతూ రాసిన గ్రంథం ?

6. ఆంధ్ర రాష్ట్రము వచ్చె మహాంధ్ర రాష్ట్రమేరుపడువేళ పొలిమేర చేరపిలిచె
నా తల్లి ఆనందం పంచుకుంది అన్న కవి ?

7. దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణకు అంకితం ఇచ్చిన ఖండకావ్యం ఏది ?

8. దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణలోని ప్రస్తుతం ఏ జిల్లాకి చెందినవారు ?

9. దాశరథి ఏ రచనకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ?

10. ఏ విశ్వవిద్యాలయాలు గౌరవడాక్టరేట్ ను దాశరథికి ప్రధానం చేసాయి ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

Leave A Reply

Your Email Id will not be published!