తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Bhakta Ramadasu

Bhakta Ramadasu - Quiz

TeluguISM Quiz - Bhakta Ramadasu
0 1,599

Bhakta Ramadasu – Quiz : భద్రాచల రామదాసు గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లానేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు(Bhakta Ramadasu) గా సుప్రసిద్ధుడైనాడు.

భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరథీ శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము – ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది.

పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరి భక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయనిర్మాణానికి ధనం సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు.

కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదులో నున్న రామదాసు గోడపై సీతారామలక్ష్మణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తించుచూ, ఆ కరుణా పయోనిధి శ్రీ రాముని కటాక్షమునకు ఆక్రోశించుచూ కాలము గడిపినాడు. రామదాసు(Bhakta Ramadasu) యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి.

 

More About : Bhakta Ramadasu     

భక్త రామదాసు క్విజ్

0%
11 votes, 2.1 avg
62

Quiz : భక్త రామదాసు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Bhakta Ramadasu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. కంచెర్ల గోపన్న గురువు పేరు ?

2. భక్త రామదాసు(1964 తెలుగు సినిమా)చిత్ర దర్శకుడు ఎవరు ?

3. శ్రీరామదాసు 2006 రామదాసు పాత్ర పోషించిన వారు ?

4. రామదాసు తండ్రిపేరు ?

5. శ్రీరామదాసు 2006 చిత్ర దర్శకుడు ఎవరు ?

6. గోపన్నను తహసిల్దారుగా నియమించిన గోపన్న మేనమామల పేర్లు ?

7. భద్రాచలంలో ఆలయాన్ని కట్టించినవారు ?

8. తెలుగులో కీర్తనలకు ఆద్యుడుగా ఎవరిని పేర్కోంటారు ?

9. కంచెర్ల గోపన్న జన్మస్థలం ?

10. కంచెర్ల గోపన్న  ఏ శతాబ్దానికి చెందినవాడు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : కూచిమంచి తిమ్మకవి క్విజ్ 

Leave A Reply

Your Email Id will not be published!