తెలుగు ఇజం = మన భాష + మన నైజం

అక్కినేని నాగేశ్వర్ రావు

Akkineni Nageswara Rao - Quiz

TeluguISM Quiz - Akkineni Nageshwara Rao
0 189

Akkineni Nageswara Rao – Quiz : అక్కినేని నాగేశ్వరరావు (1924, సెప్టెంబరు 20 – 2014, జనవరి 22) తెలుగు నటుడు, నిర్మాత. వరి చేలలో నుండి, నాటకరంగం ద్వారా కళారంగం లోకి వచ్చిన వ్యక్తి. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. అతడు నాస్తికుడు.

ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూసాడు. ఆ తరువాత సినిమాలకు పరిచయం చేసాడు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీజీవితానికి తెరలేచింది. అప్పటినుండి రకరకాల తెలుగు, తమి‌ళ సినిమాలలో 75 సంవత్సరాల పైగా నటించాడు. ఎన్. టి. ఆర్తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా అక్కినేని నాగేశ్వర్ రావు(Akkineni Nageswara Rao)  గుర్తించబడ్డాడు.

మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నాడు. భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందాడు.

చిన్నప్పటి నుండి నాటకాల మీద వున్న ఆసక్తి తోనే 1941 లో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయమయ్యాడు అక్కినేని(Akkineni Nageswara Rao) . ఆ తర్వాత 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన “సీతారామ జననం” సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి 256 సినిమాల్లో నటించాడు. అతను నటించిన ఆఖరి సినిమా “మనం”.

 

More About Akkineni Nageswara Rao

అక్కినేని నాగేశ్వర్ రావు క్విజ్

0%
0 votes, 0 avg
13

Quiz : అక్కినేని నాగేశ్వర్ రావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Akkineni Nageswara Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఎన్.టి.ఆర్ అవార్డును ఏ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు అందుకున్నారు ?

 

2. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఏ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు అందుకున్నారు ?

3. అక్కినేని నాగేశ్వరరావు తొలి సినిమా ఏ సంవత్సరంలో విడుదల అయ్యింది?

4. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న 5వ తెలుగు నటుడు ఎవరు ?

5. క్రింద పెర్కొన్న వారిలో నటసామ్రాట్ ఎవరి బిరుదు ?

6. అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడు జన్మించారు ?

7. అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఉన్న ఏఎన్ఆర్ కళాశాల ఎక్కడ కలదు ?

8. శరత్ చంద్ర నవలలోని కథానాయకుడికి అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమా ఏది ?

9. భారత తపాలా శాఖఏ సంవత్సరంలో ఎ.యన్.ఆర్ 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసారు ?

10. అక్కినేని నాగేశ్వరరావు అవార్డును అందుకున్న మొదటి గ్రహీత ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : నందమూరి తారక రామారావు

Leave A Reply

Your Email Id will not be published!