తెలుగు ఇజం = మన భాష + మన నైజం

బూర్గుల రామకృష్ణారావు

Burgula Ramakrishna Rao - Quiz

TeluguISM Quiz - Burgula Ramakrishna Rao
0 474

Burgula Ramakrishna Rao – Quiz : బూర్గుల రామకృష్ణారావు (మార్చి 13, 1899 – సెప్టెంబర్ 14, 1967) బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేసాడు.

రామకృష్ణరావు(Burgula Ramakrishna Rao) 1899 మార్చి 13 న నరసింగరావు, రంగనాయకమ్మ దంపతులకు కల్వకుర్తి దగ్గరలోని పడకల్ గ్రామంలో జన్మించాడు. వీరి స్వగ్రామం బూర్గుల; ఇంటి పేరు పుల్లం రాజు వారు. అయితే స్వగ్రామమైన బూర్గుల నామమే వీరి ప్రఖ్యాత గృహనామమైనది. ధర్మపంత్ స్కూలు (హైదరాబాద్) లో ప్రాథమిక విద్యను అభ్యసించాడు.

1915లో మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. పూణె లోని ఫెర్గూసన్ కళాశాలలో బీఏ (హానర్స్) డిగ్రీ చదివాడు. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ (లా డిగ్రీ) పూర్తిచేసి, హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.

బూర్గుల దగ్గర పివినరసింహారావు జూనియర్ లాయర్‌గా పనిచేశాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంకు అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసాడు. బూర్గుల(Burgula Ramakrishna Rao) బహుభాషావేత్త, సాహితీవేత్త.

తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు రాసేవాడు. పారశీక వాజ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది.

జగన్నాథ పండితరాయల లహరీపంచకమును, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధారారాస్తవమును తెలుగులోకి అనువదించాడు.

 

More About Burgula Ramakrishna Rao

బూర్గుల రామకృష్ణారావు క్విజ్

0%
1 votes, 5 avg
16

Quiz : బూర్గుల రామకృష్ణారావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Burgula Ramakrishna Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఏ విశ్వవిద్యాలయం బూర్గుల రామకృష్ణారావుకు డాక్టర్ ఆఫ్ లాస్ పట్టాను ప్రధానం చేసింది ?

2. బూర్గుల రామకృష్ణారావు తెలంగాణలోని ఏ జిల్లాకు చెందినవారు ?

3. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ?

4. బూర్గుల రామకృష్ణారావు ఏ రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా పని చేసాడు ?

5. బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించన రెండవ నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ ఎక్కడ జరిగింది ?

6. 1952 లో ఎవరి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ?

7. బూర్గుల రామకృష్ణారావు దగ్గర జూనియర్ లాయర్‌గా పనిచేసిన రాజకీయవేత్త ప్రధానమంత్రి ఎవరు?

8. హైదరాబాద్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ?

9. ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు జ్ఞాపకార్థం తపాలాబిళ్ళను విడుదల చేసింది ?

10. బూర్గుల రామకృష్ణారావు రచనలు ఏవీ ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : పింగళి వెంకయ్య

Leave A Reply

Your Email Id will not be published!