తెలుగు ఇజం = మన భాష + మన నైజం

ఆచార్య యన్.జి.రంగా

Acharya N G Ranga - Quiz

TeluguISM Quiz - Acharya N. G. Ranga
0 297

Acharya N G Ranga – Quiz : ఆచార్య ఎన్.జి.రంగా గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7, 1900 – జూన్ 9, 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ వాది, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు.

రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు. 1991 లో భారత ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. 1930-1991 వరకు సుదీర్ఘ కాలం భారత పార్లమెంట్‌ సభ్యునిగా పనిచేసారు.

రంగా, 1900, నవంబరు 7 న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకుజన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు.

1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా (1927-1930) పనిచేసారు. ఇతడు హేతువాది . 1924 లో గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన వెలగా సుబ్బయ్య, పిచ్చమ్మ దంపతుల కుమార్తె భారతీదేవి తో రంగా(Acharya N G Ranga) వివాహం జరిగింది.

1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా తన ఉద్యోగాన్ని వదిలి భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు. 1931 డిశంబరులో వెంకటగిరి రైతాంగ ఉద్యమ కాలంలో రంగా(Acharya N G Ranga) ఒక సంవత్సరకాలం జైలు శిక్ష అనుభవించాడు.

రైతు ఉద్యమాలను స్వాతంత్ర్య పొరాటంలో భాగం చేసారు. 1933 లో నిడుబ్రోలులో రామనీడు పేరుతో వయోజన రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు. ఈ రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు. ఈ పాఠశాల గత స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది. తన భార్య భారతీ దేవి తో కలసి వ్యక్తి గత సత్యాగ్రహంలో పాల్గోన్నారు.

 

 

More About Acharya N. G. Ranga

 

ఆచార్య యన్.జి.రంగా క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : ఆచార్య యన్.జి.రంగా

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Acharya N. G. Ranga - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఏ సంవత్సరంలో ఆచార్య ఎన్.జి.రంగా
భారత ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు ?

2. రైతుల గురించి ఆచార్య యన్.జి.రంగా గారి పరిశోధన గ్రంథాలు ఏవి ?

3. ఏ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని 'ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం' గా నామకరణం చేశారు ?

4. రంగా భవన్ ల పేరుతో ఉన్న రైతు సేవా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?

5. ఎన్.జి.రంగా కృషి విజ్ఞాన కేంద్రం ఏ సంవత్సరంలో ఏర్పాటుచేయబడింది ?

6. క్రింద వాటీలో ఆచార్య యన్.జి.రంగా రచనలు ?

7. 'ధన్య జీవి నేతాజీ' పుస్తక రచయిత ?

8. ఆచార్య ఎన్.జి.రంగా ఎప్పుడు మరణించారు?

9. రైతాంగ రక్షణ యాత్ర కోసం చేసిన పాదయాత్ర ఎన్ని నెలలపాటు కొనసాగింది ?

10. భారతీయ కిసాన్ సభను (AIKS) స్థాపించినవారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

Also Read : భోగరాజు పట్టాభి సీతారామయ్య

Leave A Reply

Your Email Id will not be published!