రావిచెట్టు రంగారావు
Ravichettu Ranga Rao - Quiz
Ravichettu Ranga Rao : రావిచెట్టు రంగారావు (డిసెంబర్ 10, 1877 – జూలై 3, 1910) తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడు.
రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావుతో కలసి శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం, పిమ్మట విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ని స్థాపించారు. సంస్కృత భాషపై ఎనేలేని గౌరవమున్నవారు.
ఆయన ఒక సంస్కృత గ్రంథాలయాన్ని స్థాపించి దాని అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన “శ్రీ శంకర భగవత్పూజ్యపాద గీర్వాణరత్న మంజూష” అన్న పేరుతో సంస్కృత గ్రంథాలయాన్ని ఈ గ్రంథాలయంలో కలిపేశారు. అందులో చతుర్వేదాలు, దశోపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, కావ్యాలు, నాటకాలు ఇత్యాది సంస్కృత ప్రబంధాలెన్నో కొనుగోలు చేసి సేకరించి పాఠకుల సౌకర్యార్థం ఉంచారు.
ఇంతేకాకుండా ఈ గ్రంథాలయం తాలూకు రెండువేల రూపాయల విలువపై వచ్చే వడ్డీతో ప్రతియేట కొత్తగా వచ్చే సంస్కృత గ్రంథాలు కొనుగోలు చేసేవారు. 1908 సంవత్సరంలో మూసీనదికి భయంకరమైన వరదలు వచ్చి హైదరాబాదు నగరాన్ని ముంచివేశాయి. ఎంతో ధన, ప్రాణనష్టం జరిగింది. అలాంటి ఆపదకాలంలో రంగారావు హైదరాబాద్ నగర ప్రజలకు సహాయపడి, నిరాశ్రయులైన వారికి, వసతి సౌకర్యాలు కల్పించారు.
వీరు ఎంతోమంది పేద విద్యార్థులను తన ఇంట్లో వుంచుకొని ఉన్నత చదువులు చెప్పించారు. అలా వారి సహాయంతో పైకివచ్చినవారిలో ఆదిరాజు వీరభద్రరావు గారొకరు. రావిచెట్టు రంగారావు గారి జీవిత చరిత్రను ఆదిరాజు వీరభద్రరావు 1910 లో ‘జీవిత చరితావళి’ అనే గ్రంథంలో కథనం చేశారు. ఇది విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి పక్షాన 1911 లో ప్రచురితమైంది.
More About : Ravichettu Ranga Rao
రావిచెట్టు రంగారావు క్విజ్
Read More : చిలకమర్తి లక్ష్మీనరసింహం