ముళ్ళపూడి వెంకటరమణ
Mullapudi Venkata Ramana - Quiz
Mullapudi Venkata Ramana : ముళ్ళపూడి వెంకటరమణ (జూన్ 28, 1931 – ఫిబ్రవరి 24, 2011) ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది.
బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత. 1995లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ నుండి రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకొన్నాడు.
1945లో “బాల” పత్రికలో రమణ మొదటి కథ “అమ్మ మాట వినకపోతే” అచ్చయ్యింది. అందులోనే “బాల శతకం” పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే “ఉదయభాను” అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయాడు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, వచ్చిన డబ్బులతో సైక్లోస్టైల్ మెషిన్ కొన్నాడు.
ఆ పత్రికకు రమణ ఎడిటర్. చిత్రకారుడు బాపు. విషయ రచయిత మండలీకశాస్త్రి. ఆర్థిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశాడు. 1954లో ఆంధ్ర పత్రిక డైలీలో సబ్ ఎడిటర్‌గా చేరాడు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే బుడుగు వ్రాశాడు.
More About : Mullapudi Venkata Ramana
ముళ్ళపూడి వెంకటరమణ క్విజ్