తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 43

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 43
0 308

Telugu States General Knowledge Quiz : (రామప్ప దేవాలయం &కోట గుళ్ళు) : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

రామప్ప దేవాలయం : ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రత్మాక గ్రామం. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.

ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారము రాముడు మరియు శివుడు కలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.

 

More About : రామప్ప దేవాలయం

 

కోట గుళ్ళు : తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఘనపూర్ మండల కేంద్రమైన ఘణపూర్ లో ఉన్న గుళ్ళు.[1] కాకతీయ కాలంలో నిర్మించబడిన ఆలయ సముదాయంలో వివిధ పరిమాణాల్లో ఉన్న 22 గుళ్ళను కోట గుళ్ళు అంటారు.[2] ఇవి కాకతీయుల కళా వైభవాన్ని తెలియజేస్తున్నాయి.

క్రీ.శ. 1199-1260 మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడు క్రీ.శ. 1213లో ఈ కోట గుళ్ళను నిర్మించాడు. గణపురం గ్రామానికి ఈశాన్య దిక్కున ఉన్న మట్టికోటలో ఈ గుళ్ళు ఉండటంవల్ల కోట గుళ్ళు అనే పేరు వచ్చింది.

రామప్ప దేవాలయం నిర్మించిన కాకతీయ సైన్యాధక్షుడు రేచర్ల రుద్రరెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడైన గణపతిరెడ్డి ఆధ్వర్యంలో ఇది నిర్మించబడింది.

 

More About : కోట గుళ్ళు

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 43

0%
0 votes, 0 avg
3

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 43

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 43

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా ఎన్నుకున్నా  అంశాలు ఏవి ?

2. దేవాలయాల గెలాక్సీలో ప్రకాశవంతమైన నక్షత్రం గా అభివర్ణించబడ్డా గుడిఏది ?

3. ఘన్ పూర్ లోని దేవాలయాల సమ్మేళనం ను ఈ విధంగా పిలుస్తారు ?

4. సగం మనిషి సగం సింహం ఆకారంలో ఏనుగుపైన ఊరేగుతున్నట్టు కనిపించే గజకేశరి విగ్రహం గల ఆలయం ?

5. రామప్ప దేవాలయం ప్రత్యేకత ఏంటీ ?

6. రామప్ప దేవాలయం నిర్మించిన వారు ?

7. రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించడని ఎవరి శాసనం చెప్పినది ?

8. హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించినవారు ?

9. రామప్పగుడిని నిర్మించిన రేచర్ల రుద్రుడు,ఏ రాజు యొక్క ప్రధాన సేనాని ?

10. కాశీబుగ్గ, అయిననోలు, మొగలిచర్ల దేవాలయాలను కట్టించిన వారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 42

Leave A Reply

Your Email Id will not be published!