తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 46

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 46
0 179

Telugu States General Knowledge Quiz : (కొండరెడ్డి బురుజు & కర్నూలు చారిత్రాత్మక కట్టడాలు) : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

కొండారెడ్డి బురుజు :  అనేది కర్నూలు నగరంలో ఉన్న ఒక కోట. ఇది కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉంది. కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి, కానీ మిగతా మూడు బురుజులు శిథిలమైపోయాయి. శిథిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి కర్నూలులోని విక్టరీ టాకీస్ ప్రక్కన ఉంది. దీనిని “ఎర్ర బురుజు” అంటారు.

ఎర్రని ఇసుకరాయితో నిర్మిచడం వలన దానికి ఆపేరు వచ్చింది. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. ఎర్రబురుజు గోడల రాళ్లపై అనేక చిన్న చిన్న బొమ్మలను మనం గమనించవచ్చు. మిగిలిన రెండు బురుజులు తుంగభద్రానదిని ఆనుకొని ఉన్నాయి. వాటిలో ఒకటి కుమ్మరి వీధి చివర, మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా ప్రక్కన ఉన్నాయి.

నదిని దాటి శత్రువులెవ్వరూ కర్నూలు నగరంలోకి రాకుండా సైనికులు ఎప్పుడూ ఇక్కడ పహరా కాస్తుండేవారు. 1930లో భారతి పత్రికలో కర్నూలులోని కుమ్మరి వీధి ప్రక్కన ఉన్న బురుజు దస్త్రాన్ని ప్రచురించి, దాని క్రింద “రామానాయుడు బురుజు” అని రాశారు. పూర్వం ఆ పేరు ఉందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. కొండారెడ్డి బురుజు చరిత్ర గూర్చి ఎటువంటి శాసనాలు లభ్యమవలేదు.

 

More About : కొండారెడ్డి బురుజు

More About : కర్నూలు చారిత్రాత్మక కట్టడాలు

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 46

0%
0 votes, 0 avg
0

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 46

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 46

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఆదోని కోట ఏ జిల్లాలో కలదు ?

2. మహానంది దేవాలయం బాదామి చాళుక్యులోని ఏ రాజు కాలంలోనిది అని చరిత్రాకారుల అభిప్రాయం?

3. కందనవోలు కోటను నిర్మించిన వారు ?

4. క్రింది వాటిలో కొండారెడ్డి బురుజు అసలు పేరు ఏది అని చరిత్రాకారుల అభిప్రాయం ?

5. యాగంటి దేవాలయం ఏ శతాబ్దానికి చెందినది ?

6. మహానంది దేవాలయం ఏ శతాబ్దానికి చెందినది ?

7. కొండారెడ్డి బురుజు ను నిర్మించినవారు ?

8. కందనవీడు కోటను అరవీడు రామరాజుకు బహూమానంగా ఇచ్చిన విజయనగర రాజు ?

9. కందెనవోలు ఏ నగరం యొక్క పూర్వ నామం ?

10. యాగంటి దేవాలయం ఎక్కడ కలదు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 45

 

 

 

Leave A Reply

Your Email Id will not be published!