తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 53
Telugu States General Knowledge Quiz
Telugu States General Knowledge Quiz : కోటలు – కొన్ని ఆలయాలు ( మెదక్) – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
మెదక్ కోట తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లాలో ఉంది. ఇది రాష్ట్ర ముఖ్య పట్టనమైన హైదరాబాదు నగరానికి 100 కి.మీ దూరంలో ఉంటుంది. మెదక్ నగరానికి ఉత్తరాన మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై 400 ఎకరాల్లో విస్తరించింది మెదక్ కోట.
ఈ కోట సుమారు 12 వ శతాబ్దం నాటిది. ఈ కోటను కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు కాలంలో నిర్మించారని ప్రతీతి. ప్రతాపరుద్రుడు ఈ దుర్గాన్ని మెతుకు దుర్గంగా పిలిచేవాడు. కాకతీయ సామ్రాజ్యానంతరం ఇది కుతుబ్ షాహీల అధీనంలోనికి వచ్చింది. ఈ కోట తెలంగాణలో ముఖ్యమైన చారిత్రాత్మక నిర్మాణం. ఈ కోటలో 17 వ శతాబ్దంలో కుతుబ్ షాహీలచే మస్జిద్ నిర్మించబడింది. అచట ధాన్యాగారాలు, శిథిలమైన గృహాలు కనిపిస్తాయి.
ఈ కోటలో మూడు ముఖద్వారాలు ఉన్నాయి. వాటిలో “ప్రధాన ద్వారం”, సింహద్వారం (ఇందులో రెండు ఆగ్రహంగా ఉన్న సింహాల శిల్పాలు ద్వారం పైన ఉంటాయి), “గజ ద్వారం” (ఇందులో రెండు ఏనుగులు బొమ్మలు రెండువైపులా ఉంటాయి). ప్రధాన మార్గం కాకతీయుల యొక్క చిహ్నమైన రెండుతలల గంఢబేరుండంతో కూడుకుని ఉంటుంది. ఆ కోటలో స్థిరమైన పైకప్పుకు ఊతం అందించుటకు ఉపయోగించే కలప (టెర్మినాలియా పనికులాటా) ను ప్రస్తుతం కూడా మనం చూడవచ్చు.
మెదక్ లో చుట్టుపక్కల అనేక చారిత్రిక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో శ్రీ సరస్వతి క్షేత్ర దేవాలయం, వేలుపుగొండ శ్రీ తు౦బురనాథ దేవాలయం, ఏడుపాయల దుర్గాభవాని గుడి ఎంతో ప్రసిద్ది. పెద్ద సంఖ్యలో పర్యాటకులు మెదక్ పట్టణానికి విచ్చేయడానికి ఈ దేవాలయాలు ఒక కారణం.
More About : మెదక్ కోట
తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 53