తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 54
Telugu States General Knowledge Quiz
Telugu States General Knowledge Quiz : ఆదిలాబాద్ – ఆసిపాబాద్ కట్టడాలు : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
ఆదిలాబాద్ : దీని ముఖ్యపట్టణం ఆదిలాబాద్.బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు అదిలాబాదును ‘ఎడ్లవాడ’ అని పిలిచే వారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోక ముందు, ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇది ఒకటి. తెలంగాణ 10 జిల్లాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో ఇది ఆదిలాబాద్ జిల్లాకు పరిపాలనా కేంద్రం.
ఆదిలాబాద్ జిల్లాకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన మొహమ్మద్ అదిల్ షాహ్ పేరు మీద వచ్చింది. మొహమ్మద్ అదిల్ షాహ్ తన ఆర్థిక మంత్రి సేవలకు మెచ్చి ఆదిలాబాదు జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహూకరించాడు. ఆర్థికమంత్రి మొహమ్మద్ అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ఆదిల్ షా బాద్ అని నామకరణం చేసాడు. క్రమంగా అది ఆదిలాబాదుగా అభివృద్ధి చెందింది. మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని ఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా కాలంలో అది ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది. తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన వివరాలు వ్రాస్తూ ఈ నగరాన్ని ఎదులాబాదుగానే ప్రస్తావించారు. ఈ జిల్లా పెరు ఎదులపురంగా పిలుస్థారు.
More About : ఆదిలాబాద్
తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 54
Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 53