తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 56
Telugu States General Knowledge Quiz
Telugu States General Knowledge Quiz : (పాలమూరు – పురాతన కట్టడాలు) : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్వపు సంస్థానాధీశులు నిర్మించిన అనేక కోటలు ఉన్నాయి. ముఖ్యంగా గద్వాల, ఆత్మకూరు, కొల్లాపూర్ సంస్థానాధీశులు పలుప్రాంతాలలో కోటలను నిర్మించారు. వీటిలో ఎక్కువగా గిరిదుర్గాలు కాగా అంకాళమ్మ కోట వనదుర్గము. గద్వాల కోట పూర్తిగా మట్టితో నిర్మించబడగా, కోయిలకొండ, చంద్రగఢ్ లాంటి కోటలు పెద్దపెద్ద బండరాళ్ళతో నిర్మించారు. మట్టికోటలు కాలక్రమంలో శిథిలావస్థకు చేరగా, రాతితో నిర్మించిన కోటలు ఇప్పటికీ చెక్కుచెదరలేవు. గద్వాల కోట లాంటివి పర్యాటకుల సందర్శన క్షేత్రాలుగా విరాజిల్లడమే కాకుండా సినిమాల షూటింగులు కూడా జరిగాయి.
- కోయిలకొండ కోట – కోయిలకొండ మండలకేంద్రంలో రాతితో నిర్మించిన కోట.
- తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన 7 గిరిదుర్గాలలో ఇది ఒకటి . కొండపై వెలిసిన దుర్గం కాబట్టి కోవెలకొండ అని పేరు. కోవెల అనగా దేవాలయం. కోవెలకొండ నామమే మార్పు చెంది ప్రస్తుతం కోయిలకొండగా మారింది.కోయిలకొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తయిన గుట్టపై కోటను నిర్మించారు. చరిత్ర ప్రకారం 14 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియరామరాయలు కాలంలో వడ్డెరాజులు ఈ కోటను నిర్మించారు.
More About : కోయిలకొండ కోట ,
తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 56
Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 55