తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 59

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 59
0 121

Telugu States General Knowledge Quiz : (కృష్ణ జిల్లా – కట్టడాలు) : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

కొండపల్లి కోట :  కృష్ణా జిల్లా, విజయవాడకు సమీపంలో ఉన్న ఒక శిథిలమైన కోట. ఈ కోటకు సంబంధించిన విలువైన ఆధారాలు, శిల్పాలు హైదరాబాదులోని స్టేట్ మ్యూజియంలో భద్రపరచారు.

ముసునూరి కమ్మ రాజులు కాలంలో ఈ కోట నిర్మితమైంది. ఢిల్లీ సుల్తానులను పారద్రోలి ఈ దేశాన్ని పరాయిపాలన నుంచి విముక్తి చేసిన తెలుగు వీరుడు ముసునూరి ప్రోలయ రాజ్యాన్ని సుభిక్షంగా, శత్రు దుర్బేధ్యంగా మలచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు చేపట్టాడు.అందులో భాగంగా కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకున్నాడు.

క్రీ.శ 1370 లో ముసునూరి నాయకుల పతనం తరువాత, క్రీ.శ 1370 లో కొండవీడు రెడ్డి రాజవంశానికి చెందిన రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. ఒరిస్సా రాజు మరణం తరువాత, సింహాసనం కోసం అతడి కుమారులు హంవీరుడు, పురుషోత్తముడు యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో హంవీరుడు బహమనీ సుల్తాన్ సహాయం తీసుకుని, సోదరుడిని ఓడించి 1472 లో ఒరిస్సా రాజ్య సింహాసనాన్ని ఆక్రమించాడు. కానీ ఈ బేరసారాల్లో అతను కొండపల్లినీ రాజమండ్రినీ బహమనీ సుల్తాన్‌కు ఇచ్చాడు. తదనంతరం పురుషోత్తముడు 1476 లో హంవీరుడిని ఓడించి ఒరిస్సా సింహాసనాన్ని ఆక్రమించాడు.

 

More About : కొండపల్లి కోట :  కృష్ణా జిల్లా

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 59

0%
0 votes, 0 avg
0

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 59

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 59

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. చల్లపల్లి కోట ఏ సంస్థానానికి రాజధానిగా ఉండేది?

 

2. కనకదుర్గ గుడి ఏ జిల్లాలో కలదు ?

3. ముసునూరి కాపయ కొండపల్లి కోట నిర్మాణాన్ని పూర్తి చేసి తర్వాత ఎక్కడ శాసనాలను వేయించాడు?

4.  క్వీన్ విక్టోరియా స్వర్ణొత్సవాల్లో భాగంగా నిర్మించిన బాపు మ్యూజియం ఏ సంవత్సరంలో కట్టబడింది ?

5. గాంధీ హిల్ కృష్ణ జిల్లాలోని ఏ నగరంలో కలదు ?

6. కొండపల్లి కోటను పరాయిపాలన నుంచి విముక్తి చేసిన తెలుగు వీరుడు ?

 

7. ప్రకాశం బ్యారేజి ఏ జిల్లాలో కలదు ?

8. కొండపల్లి కోట ఎక్కడ కలదు ?

9. ఎన్ని సంవత్సరాల పైగా కొండపల్లి కమ్మరాజులు కొండపల్లి కోటను పరిపాలించారు ?

10. మయూర వీణ ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాకు చెందినది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 58

Leave A Reply

Your Email Id will not be published!