తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 65

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 65
0 162

Telugu States General Knowledge Quiz : (బౌద్ద స్తూపం) – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

అమరావతి స్తూపం : అమరావతి లో గౌతమ బుద్ధుని అవశేషాలను పూజల నిమిత్తమై పొందుపరచి వాటిపై కట్టిన కట్టడమే అమరావతి స్తూపం. ఇది ఒక పర్యాటక అకర్షణ. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి ఉన్నత స్థితిని పొంది, బౌద్ధం క్షీణతతో మరుగున పడి. 1797 లో మరలా వెలుగులోకి వచ్చింది.

అమరావతి శిల్పకళ బుద్ధ విగ్రహం మలచడంలోను, నాగిని ప్రతిమల రూపురేఖలలోను తనదైన ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆగ్నేయ ఆసియా, శ్రీలంక దేశాలకు ఈ శిల్పకళ విస్తరించింది. ఇక్కడ లభించిన శాసనాల వలన బ్రాహ్మీలిపి నుండి తెలుగు లిపి పరిణామ క్రమంలో తొలి నాలుగు దశలను తెలుపుతుంది. శాసనాలు, శిల్పాలు స్థానిక పురావస్తు ప్రదర్శనశాల, చెన్నైలో పురావస్తు ప్రదర్శనశాల, బ్రిటీష్ మ్యూజియము లలో భద్రపరచబడ్డాయి.

ఆంధ్రదేశమందు, ముఖ్యముగా కృష్ణానదీ లోయలో, బౌద్ధమతము మౌర్య కాలము నుండి పరిఢవిల్లింది. అమరావతి (ధరణికోట), భట్టిప్రోలు, జగ్గయ్యపేట బేతవోలు,ఘంటసాల, శాలిహుండం మొదలైన చోట్ల స్తూప నిర్మాణము జరిగింది. కార్బన్ డేటింగ్ ద్వారా అమరావతి (ధాన్యకటకము) పట్టణం క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిందని తెలిసింది.

స్తూపం క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడింది. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ట స్థానము పొందిన ‘ఆంధ్రపురి’యే ధాన్యకటకం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. బుద్ధుని జీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.

 

More About : అమరావతి స్తూపం

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 65

0%
0 votes, 0 avg
2

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 65

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 65

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. భట్టిప్రోలు స్తూపం ఏ శతాబ్ధికి చెందినది ?

2. బౌద్ద క్షేత్రం శాలి హుండం ఏ శతాబ్ధికి చెందినవి ?

3. అమరావతీ నగరాన  బౌద్దుల విశ్వవిద్యాలయము స్థాపించారు అని చెప్పినవారు ?

4. బృహత్ స్తూపం ఏ శతాబ్దిలో నిర్మించబడింది?

5. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క ప్రధాన పోషకులు ?

6. పంచారామాలలో ఒకటైన అమరేశ్వర స్వామి దేవాలయం ఏ నది ఒడ్డున కలదు ?

7. ఎవరి మూలంగా అమరావతికి ధాన్యకటకము అని పేరు వచ్చింది ?

8. ధ్యాన బుద్ధ విగ్రహం ఎక్కడ కలదు ?

9. అమరావతి స్థూపం ఉన్న గ్రామం ఏది ?

10. అమరావతి స్థూపం శాతవాహనలోని ఏ రాజు కాలంలో నిర్మించబడినది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 64

 

Leave A Reply

Your Email Id will not be published!