తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 68
Telugu States General Knowledge Quiz
Telugu States General Knowledge Quiz : (చారిత్రాత్మక ఆలయాలు) – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
భీమేశ్వరాలయం – సామర్లకోట :
సామర్లకోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఈ వూరి అసలు పేరు శ్యామలదేవికోట. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. పిన్ కోడ్: 533440. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేది. ఆ గుడి ఇప్పుడు వుందో లేదో తెలీదు. ఈ ఊరు ఇప్పుడు భీమేశ్వరాలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది పంచారామాలలో ఒకటి. దీనిని కుమార భీముడనే చాళుక్య రాజు నిర్మించాడు.
ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. కందుకూరి వీరేశలింగం పంతులు వ్రాసిన రాజశేఖర చరిత్రం అనే పుస్తకంలో ఈ ఊరి చరిత్ర ఉంది. సామర్లకోట సమీపంలోని పిష్టపురం (పిఠాపురం) ప్రస్తావన మొదటి సారిగా సముద్రగుప్తుని అలహాబాదు జయస్తంభంపై కనిపిస్తుంది. సముద్రగుప్తుడు 360 CE లో దక్షిణాదిగా రాజ్యవిస్తరణ జరిపినపుడు పిష్టపురంలోని మహేంద్రుడనే రాజును జయించాడని ఆ జయస్తంభ శాసనంలో చెప్పబడింది. అంటే అప్పటికే పిఠాపురం రాజధానిగా ఉండిన ఒక గొప్ప పట్టణంగా భావించాలి. పెద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో రాయబడిన కైఫియత్తు బట్టి అప్పట్లో చామర్లకోటా అని పిలవబడేది అని తెలుస్తుంది.
More About : ఆంధ్రప్రదేశ్ విశిష్ట దేవాలయాలు
తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 68
Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 67