తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 69

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 69
0 426

Telugu States General Knowledge Quiz : శ్రీకాళహస్తీశ్వర ఆలయం – ఇతరములు : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది. సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటారు.

ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.

 

More About : శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 69

0%
0 votes, 0 avg
3

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 69

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 69

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. వేద నారాయణ స్వామి,నాగలాపురం ఏ జిల్లాలో కలదు ?

2. కైలాస కోన ఏ జిల్లాలో కలదు ?

3. శ్రీకాళహస్తి ఏ జిల్లాలో కలదు ?

4. శ్రీకాళహస్తి కి గల మరో పేరు ?

5. రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమణ గీతాన్ని ఏ జిల్లాలో ఆంగ్లంలోకి అనువదించాడు.?

6. జాతీయగీతానికి తుదిరూపునిచ్చిన ప్రాంతంగా పెర్కొన్నబడ్డా జిల్లా?

7. దక్షిణకైలాసమని ఏ చారిత్రక కట్టడానికి పేరు ?

8. దక్షిణాదికి చెందిన శాంతినికేతన్ గా పిలవబడే థియసోఫికల్ కళాశాల ఎక్కడ కలదు ?

9. ఆదిశంకరులు క్రింది ఏ దేవాలయంలో శ్రీ చక్రము స్థాపించారు ?

10. ఏ శతాబ్దంలో శ్రీకాళహస్తి దగ్గర పల్లవుల చెక్కిన శిల్పాలను గమనించవచ్చు.?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 68

 

Leave A Reply

Your Email Id will not be published!