తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 70

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 70
0 484

Telugu States General Knowledge Quiz : (నాగార్జునకొండ) – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

నాగార్జునకొండ

సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య నాగార్జునుడు పేర వెలసినది నాగార్జున కొండ. ఇది చారిత్రక పట్టణం కాగా ప్రస్తుతం ఒక ద్వీపం. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన, సా.శ.పూ. 2వ శతాబ్దపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన ప్రదర్శనశాల లో భద్రపరిచారు. ఈ ద్వీపపు ప్రదర్శనశాల ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.  అమరావతి స్తూపం చారిత్రక స్థలం నుండి ఇది పశ్చిమంగా 160 కి.మీ దూరంలో వుంది.

మహాయాన బౌద్ధం,హిందూమతం సంబంధించిన ఆలయాల అవశేషాలు ఇక్కడవున్నాయి. ఈ స్థలం బౌద్ధక్షేత్రాలలో అత్యంత విలువైనది. ఇక్కడి బౌద్ధ విశ్వవిద్యాలయాలు, ఆరామాల లో చదువుకొనటచానికి చైనా, గాంధార, బెంగాలు, శ్రీలంక నుండి విద్యార్ధులు వచ్చేవారు.

నాగులు, యక్షులు మొదలైన ప్రాచీనాంధ్ర జాతులు ఈ ప్రాంతంలో నివసించేవారు. ప్రాచీన శాసనాలలో ఈ ప్రాంతం పేరు శ్రీపర్వతం. ఈ లోయ శాతవాహన రాజ్యంలో ఉండేది. దీనికి దగ్గరలో సెఠగిరి ఉండేది. నాగార్జునకొండలో లభించిన వసుసేనుని శాసనం ప్రకారం అభీరసేనుని సేనాని శివసేపుడు సెఠగిరిపై అష్టభుజ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. సెఠగిరి జనాదరణ పొందిన హిందూ క్షేత్రం.

ఇది శాతవాహన రాజుల ఉపరాజధాని. వీరిలో చివరివాడైన యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునాచార్యుని కొరకు శ్రీపర్వతం పైన మహాచైత్య విహారాలను నిర్మించాడు.

ఇక్ష్వాకులు ఇక్కడ శాతవాహనుల సామంతులుగా ఉండేవారు. వీరిలో వాసిష్ఠీపుత్ర శ్రీఛాంతమూలుడు నాలుగో పులోమావిపై విజయాన్ని సాధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ప్రాంతంలో “విజయపురి” అనే పేరుతో నగరాన్ని నిర్మించి, తమ రాజధానిగా చేసుకున్నారు. నలుగురు ప్రముఖ ఇక్ష్వాకులలో శ్రీఛాంతమూలుడు అశ్వమేధ యాగం చేశాడు. ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం – విజయపురి క్రీ.శ. 200 నుండి 300 వరకు మహోజ్వలంగా విలసిల్లింది.

More About : నాగార్జునకొండ

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 70

0%
0 votes, 0 avg
5

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 70

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 70

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఏ రాజుల కాలంలో నాగార్జునకొండ బౌద్ధ మతస్తులకు పుణ్యక్షేత్రంగా ఉండేది ?

2. ఇండియాలో మొదటి ‘ఐలాండ్‌ మ్యూజియం’ ఎక్కడ ఉంది?

3. నాగార్జునకొండలో అష్టభుజిస్వామి అనే వైష్ణవాలయాన్ని నిర్మించినది ఎవరు ?

 

4. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతస్తులకు పుణ్యక్షేత్రంగా భాసిల్లినది ?

5. బౌద్ధమత విశేషాలతో కూడిన మ్యూజియం ఏ కొండపై ఉంది ?

6. కిందివాటిలో జంతువుల అస్థికల పైన స్థూపాన్ని తొలిసారిగా నిర్మించిన ప్రాంతం ఏ బౌద్ధ క్షేత్రంలో ఉంది ?

7. ఇక్ష్వాకుల కాలంలో ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు స్వతంత్రంగా దానాలు చేయడాన్ని ఈ శాసనాలు పేర్కొంటాయి ?

8. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతా అవశేషం, కర్ణాభరణం ఎక్కడ స్థాపించిన మ్యూజియంలో ఉన్నట్టు చరిత్రాకారుల అభిప్రాయం ?

 

9. వైదిక మతాలంబి అయిన వీర పురుషదత్తుడు తర్వాత మతాన్ని స్వీకరించినట్లు తెలియజేస్తున్నది ఏది ?

 

10. అమరావతి శిల్ప సంప్రదాయం ఇక్ష్వాకుల కాలంలో ఎచ్చట నిర్మించిన శిల్ప నిర్మాణంలో ఉన్నత శిఖిరాలకు చేరుకున్నది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 69

Leave A Reply

Your Email Id will not be published!