తెలుగు ఇజం = మన భాష + మన నైజం

మహానటి సావిత్రి

Mahanati Savitri

TeluguISM Quiz - Savitri
0 341

Mahanati Savitri Quiz – నిశ్శంకర సావిత్రి (డిసెంబరు 6, 1936 – 1981 డిసెంబర్ 26) తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు. అభిమానులచేత మహానటిగా కీర్తింపబడింది. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలగ నాయుళ్ళు కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న వెంకట్రామయ్య చౌదరి ఆమెను పెంచి పెద్దచేశాడు. చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది.

సావిత్రి 13 సంవత్సరాల వయసులో ఉన్నసమయంలో కాకినాడలోని ఆంధ్రనాటక పరిషత్ నిర్వహించిన నృత్యనాటక పోటీలలో ఆనాటి హిందీ నటుడు, దర్శకుడు, హిందీ సినీరంగంలో ప్రసిద్ధుడు అయిన పృధ్వీరాజకపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నది. అది ఆమెలో కళలపట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. ఆమె 1949లో చలనచిత్రాలలో నటించడానికి మద్రాసు నగరంలో ప్రవేశించింది.

ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మిస్సమ్మలో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి.1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన మాయాబజార్ చిత్రంలో ఆమె ప్రదర్శించిన అసమాన నటనా వైదుష్యం ఆమె కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు యెన్నో వైవిధ్యమైన పాత్రలను తనకే సాధ్యమైన రీతిలో పోషించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది.

 

More About : మహానటి సావిత్రి

మహానటి సావిత్రి క్విజ్

0%
1 votes, 1 avg
16

Quiz : మహానటి సావిత్రి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Mahanati Savitri - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ?

2. మహానటి గా అభిమానులచే కీర్తించబడినవారు ?

3. "మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి "పుస్తక రచయిత ?

4. సినీనటి సావిత్రి జీవితాన్ని మలుపు తిప్పిన మొదటి సినిమా?

5. మహానటి సావిత్రి గారు నటించిన ఆఖరి చిత్రం ?

6. సినీనటి సావిత్రి జీవితం గురించి రాసిన పుస్తకం పేరు ?

7. కీర్తీ సురేష్ నటించిన మహానటి సినిమా ఏ సంవత్సరం విడుదలయ్యింది ?

8. సావిత్రి గారికి కళల పట్ల ఆరాధన పెరగడానికి కారణమైనవారు ?

9. మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి పుస్తకం ఎప్పడు విడుదల అయ్యింది ?

10. నాగ్ ఆశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమా ఏ భాషల్లో విడుదలయ్యింది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తాడేపల్లి లక్ష్మీ కాంతారావు

 

Leave A Reply

Your Email Id will not be published!