తెలుగు ఇజం = మన భాష + మన నైజం

జమలాపురం కేశవరావు

Jamalapuram Keshava Rao

TeluguISM Quiz - Jamalapuram Keshava Rao
0 499

Jamalapuram Keshava Rao Quiz – సర్దార్ జమలాపురం కేశవరావు (సెప్టెంబరు 3, 1908 – మార్చి 29, 1953), నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. హైదరాబాదు రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించాడు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’గా పిలుచుకుంటారు.

వందేమాతరం గీతాలాపనను నిషేధించినందుకు నిరసనగా, కళాశాల విద్యార్థులను కూడగట్టి, నిరసనోద్యమంలోకి దిగాడు. గీతాన్ని ఆలాపించనివ్వకపోతే తరగతులకు హాజరుకాబోమని హెచ్చరించాడు. దీంతో చివరకు నిజాం పాలకవర్గం నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. ఈఘటన తర్వాత కేశవరావు ఆలోచనా పరిధిని మరింత విస్తృతం చేసి ఆయన వెళ్లాల్సిన మార్గాన్ని మరింత స్పష్టం చేసింది.

1923లో రాజమండ్రిలో మొదటిసారి మహాత్మా గాంధీ ఉపన్యాసాన్ని విన్న కేశవరావు, 1930లో విజయవాడలో జరిగిన సభలో గాంధీ పరిచయంతో మరింత ఉత్తేజితుడైనాడు. ఆంధ్రపితామహుడుగా మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గ్రంథాలయ ఉద్యమంను తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ప్రచారం గావించాడు. వయోజన విద్యకై రాత్రి పాఠశాలలు నడపడంలో కేశవరావు ముందుండేవాడు. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రత్యేక శ్రద్ధను కనపరిచేవాడు. ‘హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌’ స్థాపనలో కేశవరావు కీలకపాత్ర వహించి, దానికి మొదటి అధ్యక్షుడయ్యాడు. 1938లో దీపావళి సందర్భంగా ఆవిర్భవించిన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్‌లో కేశవరావు పాత్ర నిర్వహించాడు.

 

More About : Jamalapuram Keshava Rao

 

జమలాపురం కేశవరావు క్విజ్

0%
0 votes, 0 avg
22

Quiz : జమలాపురం కేశవరావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Jamalapuram Keshava Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. జమలాపురం కేశవరావు ఏ రంగంలో ప్రసిద్ధిచెందారు ?

2. జమలాపురం కేశవరావు అధ్యక్షత వహించిన ఆంధ్రమహాసభ?

3. జమలాపురం కేశవరావుకు దక్కన్ సర్దార్ బిరుదును ఇచ్చినవారు ?

 

4. 1947లో జమలాపురం కేశవరావు స్టేట్ కాంగ్రెస్ తరపున ఎక్కడ సత్యాగ్రహం చేసి 2 సంవత్సరాలు జైలుశిక్షకు గురైనారు ?

5. జమలాపురం కేశవరావు అధ్యక్షత వహించిన 13వ ఆంధ్రమహాసభ ఎక్కడ జరిగినది ?

6. జమలాపురం కేశవరావు జన్మించిన గ్రామం ?

7. ఏ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని తెలంగాణలో ఊరూరా ప్రచారం చేసినవారు ?

8. సర్దార్ జమలాపురం కేశవరావు జీవితచరిత్ర  రాసినవారు ?

9. జమలాపురం కేశవరావు మొదటిసారిగా  ఎక్కడ మహాత్మా గాంధీ ఉపన్యాసాన్ని విన్నాడు ?

10. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తొలి అధ్యక్షుడు ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : కల్లూరి సుబ్బరావు

Leave A Reply

Your Email Id will not be published!