తెలుగు ఇజం = మన భాష + మన నైజం

అంజలీ దేవి

Anjali Devi

TeluguISM Quiz - Anjali Devi
0 144

Anjali Devi – Quiz : అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి (ఆగష్టు 24, 1927 – జనవరి 13, 2014) 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి, నిర్మాత. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా.

తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో సంగీత దర్శకుడు. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము, 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది.

ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు. 1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు. సువర్ణసుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993), పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.

 

More About : Anjali Devi

 

అంజలీ దేవి క్విజ్

0%
0 votes, 0 avg
1

Quiz : అంజలీ దేవి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Anjali Devi - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఏ సంవత్సరంలో అంజలీదేవిని అక్కినేని నాగేశ్వరరావు అవార్డు లభించినది ?

2. అంజలీదేవి ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాకు చెందినవారు ?

3. అంజలీదేవి తన భర్తతో నిర్మించిన అంజలి పిక్చర్స్ ఎన్ని సినిమాలను నిర్మించినది ?

4. అంజలీదేవి  మొట్టమొదట ఫిలింఫేర్ ఉత్తమ నటిగా అందుకున్న చిత్రం ?

5. అంజలీదేవి మొదటిసారి నిర్మాతగా తీసిన సినిమా అనార్కలి ఏ సంవత్సరంలో విడుదలయ్యింది ?

6. అంజలీదేవికి అభినవ సీతమ్మగా పేరుతెచ్చి పెట్టిన సినిమా ?

7. అంజలీదేవి నాయికగా నటించిన మొదటి సినిమా ఏది ?

8. అంజలీదేవిను రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము వరించినది ?

9. అంజలీదేవి నటించిన చివరి చిత్రం ఏ సంవత్సరంలో విడుదలయ్యింది?

10. అంజలీదేవి ఏ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డును పొందినది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : మహానటి సావిత్రి

Leave A Reply

Your Email Id will not be published!