కల్లూరి చంద్రమౌళి
Kalluri Chandramouli
Kalluri Chandramouli – Quiz : కల్లూరి చంద్రమౌళి (నవంబరు 15, 1898 – జనవరి 2, 1992) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఆర్ష విద్యాలంకార బిరుదాంకితుడు. ఇతను సంయుక్త మద్రాసు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ మూడింటిలో మంత్రిపదవి నిర్వహించాడు.
దేవాదాయ శాఖా మంత్రిగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా పనిచేశాడు.భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించాడు..సమగ్ర పంచాయితీ రాజ్ చట్టం మొదటిసారి రూపొందించి మద్రాసు శాసన సభలో అమోదింపజేసిన వ్యక్తి. శ్రీశైలం, భద్రాచలం దేవాలయాల జీర్ణోద్ధరణ గావించాడు.
బ్రిటీష్ ప్రభుత్వంలో ఉద్యోగం చేయటానికి నిరాకరించిన చంద్రమౌళి దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. 1926లో వార్దా సేవాగ్రాం వెళ్ళి గాంధీజీని కలిసాడు. అక్కడ మూడు నెలలు ఉండి కాంగ్రెస్ కార్యకర్తగా ఖద్దరు దరించి, గుంటూరు వచ్చాడు. ఊరురూ తిరిగి యువజన సంఘాలను పెట్టి వారిలో స్వతంత్ర భావాలను నాటాడు.
ఉప్పు సత్యాగ్రహం లో పాల్గోని అరెస్టైయి 18-6-1930 నుండి 12-3 1931 వరకు రాయవెల్లూరు జైల్లో గడిపాడు. గుంటూరులో కొండా వెంకటప్పయ్య ఇంటిలో ఉప్పు తయారు చేసి శాసనోల్లఘన చేసినందులకు 25-2-1932 నుండి 24-2-1933 వరకు కడలూరు జైల్లో గడిపాడు.1933 డిసెంబరులో గాంధీజీ ఆంధ్రలో హరిజన యాత్ర సాగించాడు. వారి గుంటూరు పర్యటనలో చంద్రమౌళి అన్ని తానై దానిని విజయవంతం చేసాడు. గాంధీజీ చేత 1933 డిసెంబరు 23 న కావురు వినయాశ్రమంకి ప్రారంబోత్సవం చేపించాడు, అనేక గ్రామాలలో హరిజనులచేత దేవాలయ ప్రవేశం చేయించాడు.
More About : Kalluri Chandramouli
కల్లూరి చంద్రమౌళి క్విజ్