తెలుగు ఇజం = మన భాష + మన నైజం

సురభి కమలాబాయి

Surabhi Kamalabai

TeluguISM Quiz - Surabhi Kamalabai
0 134

Surabhi Kamalabai – Quiz : సురభి కమలాబాయి, (1907 – 1971) తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని. ఈమె 1931లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రము భక్తప్రహ్లాద లో లీలావతి పాత్ర ధరించింది.

ఈమె తండ్రి కృష్ణాజీరావు. తల్లి వెంకూబాయి కమలాబాయితో గర్భవతిగా ఉండి ఒక నాటకములో దమయంతి పాత్ర వేస్తున్నప్పుడు పురిటినొప్పులు రాగా తెరదించి ఆ రంగస్థలంమీదే కమలాబాయిని ప్రసవించడం విశేషం. ప్రేక్షకులు ఇదికూడా నాటకంలో ఒక భాగమనుకొన్నారు. తీరా విషయం తెలిసిన తర్వాత ప్రేక్షకులు చంటిబిడ్డ మీద డబ్బుల వర్షం కురిపించారు.

రంగస్థల కుటుంబంలో పుట్టిన కమలాబాయికి చిన్నప్పటి నుండే నటన అలవాటయ్యింది. బాల్యంలో కృష్ణుని, ప్రహ్లాదుని పాత్రలు వేస్తుండేవారు. యుక్తవయసు వచ్చిన తర్వాత మగపాత్రలు ఆపేసి ఆడపాత్రలు ధరించడం ప్రారంభించింది. అందరూ మహిళలే నటించి విజయవంతమైన సావిత్రి నాటకంలో ఆమె సావిత్రి పాత్రను పోషించింది.

బాల్యం నుంచి రంగస్థల నటిగా ఎదుగుతూ హెచ్‌.ఎం.రెడ్డి రూపొందించిన తొలి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ లో హిరణ్యకశపునిగా నటించిన మునిపల్లె వెంకటసుబ్బయ్య సరసన లీలావతిగా పరిచయమయ్యారు. తరువాత సర్వోత్తమ బదామి దర్శకత్వంలో సాగర్‌ ఫిలింస్‌ రూపొందించిన ‘పాదుకా పట్టాభిషేకం’లో సీతగా అద్దంకి శ్రీరామమూర్తి సరసన, సాగర్‌ ఫిలింస్‌ బాదామి సర్వోత్తంతో రూపొందించిన ‘శకుంతల’లో శకుంతలగా యడవల్లి సూర్యనారాయణతో నటించారు. బి.వి.రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలింస్ నిర్మించిన ‘సావిత్రి’లో సావిత్రిగా టైటిల్‌ రోల్‌ పోషించారు. సరస్వతి సినీ టోన్‌ నిర్మించిన ‘పృథ్వీపుత్ర’లో ఓ ముఖ పాత్ర పోషించారు.

 

More About : Surabhi Kamalabai

సురభి కమలాబాయి క్విజ్

 

Also Read : శోభన్ బాబు

Leave A Reply

Your Email Id will not be published!