తెలుగు ఇజం = మన భాష + మన నైజం

పైడిమర్రి వెంకటసుబ్బారావు

Pydimarri Venkata Subba Rao

TeluguISM Quiz - Pydimarri Venkata Subba Rao
0 254

Pydimarri Venkata Subba Rao – Quiz : పైడిమర్రి వెంకటసుబ్బారావు (1916 జూన్ 10 – 1988 ఆగస్టు 13) నల్గొండ జిల్లా, అన్నెపర్తికి చెందిన రచయిత, బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి…) రచయిత. పైడిమర్రి రాంబాయమ్మ, వెంకవూటామయ్య దంపతులకు నల్లగొండ కేంద్రానికి అతి సమీపంలో ఉండే అన్నెపర్తిలో జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం అన్నెపర్తి, నల్లగొండలోనే సాగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో నిష్ణాతులు.

 

ఆయన 1962 లో విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు ఈ ప్రతిజ్ఞ తయారు చేశాడు. భారత్-చైనా యుద్ధం జరుగుతున్న సమయమది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. తమ దేశ ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని..! ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించి, పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది.

అప్పటికే విదేశీ భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి ఈ విషయం గుర్తించాడు. మన దేశ విద్యార్థుల్లోనూ దేశభక్తిని పెంపొందించడానికి గేయాలుంటే బాగుంటుందని భావించాడు. పలు రచనలు చేసిన అనుభవంతో ఆ ఆలోచనకు రూపమివ్వడం మొదలుపెట్టాడు. ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు. విశాఖ సాహితీ మిత్రుడు తెన్నేటి విశ్వనాధంతో చర్చించాడు. ‘వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలము’ అన్న వాక్యాన్ని అదనంగా చేర్చాడు.

 

More About : Pydimarri Venkata Subba Rao

 

పైడిమర్రి వెంకటసుబ్బారావు క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : పైడిమర్రి వెంకటసుబ్బారావు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Pydimarri Venkata Subba Rao - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. పైడిమర్రి వెంకటసుబ్బారావు గారు ఎప్పుడు మరణించారు ?

2. "భారతదేశం నా మాతృభూమి" ఎవరి జీవితచరిత్ర?

3. ఎవరి సాయంతో పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞ అప్పటి విద్యాశాఖ మంత్రి దృష్టికి వెళ్ళింది ?

4. ఎవరి అధ్యక్షతన పైడిమర్రి వెంకటసుబ్బారావు రచించిన ప్రతిజ్ఞను  జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు ?

5. 'కాలభైరవుడు' అనే నవల రచయిత ఎవరు?

6. పైడిమర్రి వెంకటసుబ్బారావు ఎప్పుడూ జన్మించారు?

7. ''ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి" పేరుతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించినవారు?.

8. పైడిమర్రి వెంకటసుబ్బారావు గారి జన్మస్థలం ఎక్కడ?

9. " ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి" పేరుతో ఒక ప్రత్యేక సంచికను ఏ సంవత్సరంలో ప్రచురించారు?

10. పైడిమర్రి వెంకటసుబ్బారావు రచించిన నాటకాలేవి ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : బాలగంగాధర్ తిలక్

 

Leave A Reply

Your Email Id will not be published!