తెలుగు ఇజం = మన భాష + మన నైజం

కాంచనమాల

Kanchanamala

TeluguISM Quiz - Kanchanamala
0 143

Kanchanamala – Quiz : కాంచనమాల (మార్చి 5, 1917 – జనవరి 24, 1981) తొలితరం నటీమణులలో ఒకరు. ఆంధ్రా ప్యారిస్‌గా పేరుపొందిన తెనాలి పట్టణం ఆవిడ స్వస్థలం. ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణులలో ఈవిడా ఒకరు.

చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించారు. కాంచనమాల రూపలావణ్యం, విశాలనేత్రాలు, అందమైన ముఖం చూసి సి. పుల్లయ్య ఆమె చేత వై.వి.రావు నిర్మించిన కృష్ణ తులాభారం (1935) లో మిత్రవింద వేషం వేయించారు.

ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులని తన వైపుకి తిప్పుకున్నారు ఈమె. ఆ తర్వాత చిత్రం వీరాభిమన్యు (1936) లోనే ఆమె కథానయిక స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా విప్రనారయణ (1937), మాలపిల్ల (1938), వందేమాతరం (1939),మళ్ళీ పెళ్ళి (1939), ఇల్లాలు (1940), మైరావణ (1940), బాలనాగమ్మ (1942) వంటి సినిమాలలో కథానాయిక పాత్ర పోషించారు. గృహలక్ష్మి (1938) లో మాత్రం వాంప్ పాత్ర పోషించారు. విప్రనారాయణలో దేవదేవిగా ఆమె అందం, అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటు రాయిలా గ్రుచ్చుకుంది.

 

More About : Kanchanamala

కాంచనమాల క్విజ్ 

0%
2 votes, 3 avg
5

Quiz : కాంచనమాల

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Kanchanamala - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. " దిన దినము పాపడ్ని దీవించి పొంది దేవలోకములోని దేవతల్లారా " ఆనాటి తల్లులు మొదట  ఎవరు పాడిన పై పాటను లాలిపాడుతూ తమ బిడ్డను నిద్రపుచ్చేవారు ?

2. కాంచనమాల,చిత్తూరు నాగయ్య హీరో, హీరోయిన్లగా నటించిన చిత్రం ?

3. కాంచనమాల నటించిన తొలి రంగస్థల నాటకం ఏది ?

4. కాంచనమాల మొదటి చిత్రం ?

5. కాంచనమాల ఎప్పుడు జన్మించారు ?

6. వీరాభిమన్యు చిత్రంలో ఉత్తర పాత్రను పోషించిన వారు ?

7. శ్రీ శ్రీ మహాప్రస్థానం కవితల్లో పేర్కొన్నబడ్డ నటి ?

8. ." స్త్రీ పాత్రలను స్త్రీలే పోషిస్తున్న తొలి నాటకం" సారంగధర లో చిత్రాంగి వేషం వేసిన నటి ?

9. భారత చలనచిత్ర రంగంలో తొలి డ్రీమ్‌గర్ల్‌ గా పేరుగాంచిన వారు ?

10. నాటి తెలుగు చిత్ర సినిమాలో " క్వీన్ ఆఫ్ బ్యూటీ "గా ఎవరిని  పిలిచేవారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : దాసరి కోటిరత్నం

Leave A Reply

Your Email Id will not be published!