తెలుగు ఇజం = మన భాష + మన నైజం

నీలం సంజీవ రెడ్డి

Neelam Sanjiva Reddy

TeluguISM Quiz - Neelam Sanjiva Reddy
0 179

Neelam Sanjiva Reddy – Quiz : నీలం సంజీవరెడ్డి (మే 19, 1913 – జూన్ 1, 1996) భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్‌సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త.

ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజా నాయకుడు నీలం సంజీవ రెడ్డి. ముఖ్యంగా లోకసభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికారపక్ష -ప్రతిపక్షం మంచి వాతావరణం ఏర్పరచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి గారు .

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్ష నాయకుణ్ణి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండా ఎన్నికయ్యాడు. ముఖ్యమంత్రి పదవి తథ్యమైనా, అప్పటి రాజకీయాల ఫలితంగా తాను తప్పుకుని టంగుటూరి ప్రకాశం పంతులుకు నాయకత్వం అప్పగించి, ఉపముఖ్యమంత్రి అయ్యాడు.

మళ్ళీ 1955లో రాజకీయాల ఫలితంగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎన్.జి.రంగా నాయకత్వం లోని కృషికార్ లోక్ పార్టీ మద్దతు కాంగ్రెసుకు అవసరమైంది. అయితే బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తాము మద్దతు ఇస్తామని రంగా ప్రకటించడంతో తాను తప్పుకుని మళ్ళీ ఉపముఖ్యమంత్రి అయ్యాడు.

 

More About : Neelam Sanjiva Reddy

నీలం సంజీవ రెడ్డి క్విజ్

0%
1 votes, 2 avg
5

Quiz : నీలం సంజీవ రెడ్డి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Neelam Sanjiva Reddy - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నీలం సంజీవ రెడ్డి ఏ మంత్రిత్వ శాఖలో పనిచేసారు ?

2. నంద్యాల నియోజకవర్గం లో ఉన్నప్పుడు నీలం సంజీవ రెడ్డి ఏ పార్టీ తరుపున లోక్ సభ స్పీకర్ గా పనిచేసారు ?

3. నీలం సంజీవ రెడ్డి స్వస్థలం ?

4. నీలం సంజీవ రెడ్డి జనతా పార్టీ తరుపున ఏ సంవత్సరంలో లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు ?

5. ఏ సంవత్సరంలో నీలం సంజీవ రెడ్డికి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంగౌరవ డాక్టరేటు బహూకరించింది ?

6. నీలం సంజీవ రెడ్డి ఎప్పుడు జన్మించారు ?

7. భారతదేశపు 4వ లోక్ సభ స్పీకర్ ఎవరు ?

8. నీలం సంజీవ రెడ్డి ఏ సంవత్సరంలో రాష్ట్రపతి గా నియమితులయ్యారు ?

9. "పెన్నానదిలో ప్రవహించేది నీళ్ళు కాదు, ఇసుక"అన్నదెవరు ?

10. నీలం సంజీవ రెడ్డికి ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు బహూకరించింది.?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : కాసు బ్రహ్మానందరెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!