తెలుగు ఇజం = మన భాష + మన నైజం

దామోదరం సంజీవయ్య

Damodaram Sanjivayya

TeluguISM Quiz - Damodaram Sanjivayya
0 223

Damodaram Sanjivayya – Quiz : దామోదరం సంజీవయ్య (ఫిబ్రవరి 14,1921 – మే 8, 1972) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త మద్రాసు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రములో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది.

సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలంలో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబములో చివరివాడు సంజీవయ్య.

 

 

 

చిన్నయ్య ఆర్థిక సహాయముతో అనంతపురం దత్తమండల కళాశాలలో గణితము, ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశాడు. 1942లో బీ.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధము వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉంది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరాడు. 1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) కార్యాలయములో సహాయకునిగా పనిచేశాడు.

సంజీవయ్యకు విద్యార్థిగా ఉన్న రోజుల్లో రాజకీయాలపై, స్వాతంత్ర్యోద్యమముపై ఏమాత్రము ఆసక్తి చూపలేదు. కానీ లా అప్రెంటిసు చేస్తున్న సమయములో వివిధ రాజకీయనాయకుల పరిచయము, సాంగత్యము వలన రాజకీయాలలో ప్రవేశించాలనే ఆసక్తి కలిగినది. సంజీవయ్య మంచి వక్త. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ధారాళంగా, మనోరంజకంగా మాట్లాడేవారు.

1950 జనవరి 26న రాజ్యాంగము అమలులోకి రావడముతో అప్పటి దాకా రాజ్యాంగ రచన నిర్వహించిన భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్ గా అవతరించింది. అయితే ప్రొవిజనల్ పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభలలో రెండిట్లో సభ్యత్వము ఉన్న సభ్యులు ఏదొ ఒకే సభ్యత్వముని ఎన్నుకోవలసి వచ్చింది.

 

More About : Damodaram Sanjivayya

 

దామోదరం సంజీవయ్య క్విజ్ 

0%
0 votes, 0 avg
1

Quiz : దామోదరం సంజీవయ్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Damodaram Sanjivayya - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. పార్లమెంట్‌లో బోనస్‌ చట్టాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు ?

2. రెండుసార్లు అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడు అయిన ఘనత దక్కించుకున్న తొలి దళిత కాంగ్రేసు అధ్యక్షుడు ఎవరు ?

3. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గములో దామోదరం సంజీవయ్య నిర్వహించిన శాఖలు ?

4. దామోదరం సంజీవయ్య  ఏ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి పదవిని అదిష్టించారు ?

5. ఇందిరా గాంధీ ప్రభుత్వములో దామోదరం సంజీవయ్య నిర్వహించిన పదువులు ?

6. దామోదరం సంజీవయ్య గౌరవార్థం భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ?

7. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ ఎక్కడ కలదు ?

8. దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాకు చెందినవారు ?

9. దామోదరం సంజీవయ్య రచించి నటించిన నాటకం ఏదీ?

10. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : నీలం సంజీవ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!