తెలుగు ఇజం = మన భాష + మన నైజం

బెజవాడ గోపాలరెడ్డి

Bezawada Gopala Reddy

TeluguISM Quiz - Bezawada Gopala Reddy
0 138

Bezawada Gopala Reddy – Quiz : స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి (ఆగష్టు 7, 1907 – మార్చి 9, 1997). పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్కు గవర్నరు గాను, రాజ్యసభ సభ్యుడు (1958-1962) గా కూడా పనిచేసాడు.

జాతీయోద్యమంలో పాల్గొని చెరసాలల్లో సంవత్సరాల తరబడి గడిపారు. ముప్పయి సంవత్సరాలు నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అప్పటికింకా ఆయన అవివాహితుడు. తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను మంత్రిగా వివాహమాడారు. కర్నూలులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రి అయ్యాఅరు. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ కేంద్రంలో మంత్రిగా ఆహ్వానించి రెవిన్యూ మంత్రిని చేశారు.

 

More About : Bezawada Gopala Reddy 

బెజవాడ గోపాలరెడ్డి క్విజ్ 

0%
0 votes, 0 avg
2

Quiz : బెజవాడ గోపాలరెడ్డి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Bezawada Gopala Reddy - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఏ సంవత్సరంలో బెజవాడ గోపాలరెడ్డి ఉత్తరప్రదేశ్ కు గవర్నర్ గా నియమితులయ్యారు ?

2. మన పూర్వులు చెప్పినదంతా కడపటి సత్యమా వారు తిని మిగిల్చిన దానిని నెమరు వేస్తుండాలా అన్నదెవరు ?

3. బెజవాడ గోపాలరెడ్డి ఉత్తరప్రదేశ్ కు ఎన్నవ గవర్నర్ గా ఉన్నారు ?

4. బెజవాడ గోపాలరెడ్డి ఎక్కడ జన్మించారు ?

5. బెజవాడ గోపాలరెడ్డి ఎప్పుడు మరణించారు ?

6. ఆంధ్ర ఠాగూర్‌గా ప్రసిద్ధి చెందినవారు?

7. ఆంధ్ర రాష్ట్రా చివరి ముఖ్యమంత్రి ఎవరు ?

8. బెజవాడ గోపాలరెడ్డి ఏ రంగంలో ప్రసిద్ధి చెందినారు ?

9. బెజవాడ గోపాలరెడ్డి ఎప్పుడు జన్మించారు ?

10. ఆంధ్రప్రదేశ్ తొలి ఉపముఖ్యమంత్రి ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : దామోదరం సంజీవయ్య

Leave A Reply

Your Email Id will not be published!