తెలుగు ఇజం = మన భాష + మన నైజం

పొట్టి శ్రీరాములు

Potti Sreeramulu

TeluguISM Quiz - Potti Sreeramulu
0 188

Potti Sreeramulu – Quiz : పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 – 1952 డిసెంబరు 15) ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు.

ఆంధ్రులకు ప్రాత: భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.

 

పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం.

ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే”లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం నెలకు 250 రూపాయలు.

25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు.

స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు.

 

More About : Potti Sreeramulu

 

పొట్టి శ్రీరాములు క్విజ్

0%
2 votes, 2.5 avg
4

Quiz : పొట్టి శ్రీరాములు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Potti Sreeramulu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. హరిజనులకు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశం కోరుతూ నిరాహార దీక్షను ఏ సంవత్సరం లో పొట్టి శ్రీరాములు ప్రారంభించారు ?

2. ఏ జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు ?

3. మదరాసు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో‘ హరిజన దినం’ జరుపుకోవాలని నిరాహార దీక్ష చేసినవారు ?

4. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్దం తపాల శాఖ వారు ఏ సంవత్సరంలో తపాల బిళ్ళను విడుదల చేసారు ?

5. అమరజీవి శ్రీరాములు ఏ సంవత్సరంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు నిరాహారదీక్ష ప్రారంభించాడు ?

6. ‘‘గాంధీజీ తుపాకీ గుండుకు అసువులు కోల్పోగా, ఆయన బోధించిన సత్యం, అహింసల కోసం శ్రీరాములు ఆత్మ బలిదానం చేశాడు’’ అన్నదేవరు?

7. అమరజీవి పొట్టి శ్రీరాములు  క్రింద పెర్కొన్న వాటిలో పాల్గొన్న  స్వాతంత్ర్య ఉద్యమాలేవి ?

8. ఏ సంవత్సరంలో పొట్టి శ్రీరాములు వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష ప్రారంభించారు ?

 

9. మనలో మనం తగువులాడుకుంటున్న సమయంలో ఆంధ్రరాష్ట్రం కోసం తన ప్రాణాలను బలిదానం చేసి, మనందరికీ ఒక గుణపాఠం నేర్పాడు శ్రీరాములు. స్వార్థంతో మనమంతా శ్రీరాములును దీక్ష విరమించవలసిందిగా కోరాం. అయితే, శ్రీరాములు ఒక ఆదర్శం కోసం చివరిదాకా దీక్షను కొనసాగించి, నిస్సంకోచంగా తన నిండు ప్రాణాలను అర్పించాడు.’’అని అన్నదెవరు ?

10. పొట్టి శ్రీరాములు ఎప్పుడు మరణించారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read :  నడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహరావు

Leave A Reply

Your Email Id will not be published!