తెలుగు ఇజం = మన భాష + మన నైజం

అల్లూరి సీతారామరాజు

Alluri Sitarama Raju

TeluguISM Quiz - Alluri Sitarama Raju
0 371

Alluri Sitarama Raju – Quiz : భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 7)ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

 

సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు, మౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు.

సీతారామరాజు మరణంతో మిగిలిన విప్లవవీరులు ప్రాణాలకు తెగించి విజృంభించారు. వారి దుస్సాహసాల వలన పరిణామాలు విపరీతంగా జరిగాయి. కొందరు పోరాటాలలో మరణించారు. మరికొందరు పట్టుబడ్డారు. ఎండు పడాలును మే 26న గ్రామ ప్రజలు పట్టుకొని చంపివేశారు. సంకోజీ ముక్కనికి 12 సంవత్సరాల శిక్ష విధించారు. గంటదొర భార్యను, కూతురిని బంధించారు. జూన్ 7న “పందుకొంటకొన” వాగువద్ద గంటందొర సహచరులకు, సైనికులకు చాలాసేపు యుద్ధం జరిగింది. చాలా సేపు చెట్టు చాటునుండి తుపాకీ కాల్చిన గంటందొర తూటాలు అయిపోయాక ముందుకొచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అతనిని కాల్చివేశారు. జూన 10వ తేదీన గోకిరి ఎర్రేసును నర్సీపట్నం సమీపంలో పట్టుకొన్నారు. జూన్ 16న బొంకుల మోదిగాడు దొరికిపోయాడు.

 

More About : Alluri Sitarama Raju

 

అల్లూరి సీతారామరాజు క్విజ్

0%
3 votes, 4.7 avg
38

Quiz : అల్లూరి సీతారామరాజు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Alluri Sitarama Raju - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. .ఏ సంవత్సరంలో భారత తపాల శాఖ అల్లూరి సీతారామ రాజు స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది ?

2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండగగా ఎవరి పుట్టిన రోజును జరుపుకుంటారు ?

3. అల్లూరి సీతారామరాజు తొలిసారిగా ఏ సంవత్సరంలో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసాడు ?

4. బ్రిటీష్ అధికారులపై గెరిల్లా యుద్ధం చేసి మన్యం వీరునిగా పేరొందిన యోధుడు ఎవరు?

5. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్ రచన చేసినవారు ?

6. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్ ఏ సంవత్సరంలో విడుదలయ్యింది ?

7. సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. ....అన్నదెవరు ?

 

8. అల్లూరి సీతారామరాజు ఎప్పుడు జన్మించారు ?

9. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తి, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయనో హీరో. అన్న వ్యక్తి ఎవరు ?

10. అల్లూరి సీతారామరాజు సమాధి ఎక్కడుంది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : పొట్టి శ్రీరాములు

Leave A Reply

Your Email Id will not be published!