ఎస్.వరలక్ష్మి
S. Varalakshmi
S. Varalakshmi – Quiz : ఎస్.వరలక్ష్మి (ఆగస్ట్ 13, 1937 – సెప్టెంబర్ 22, 2009) తెలుగు సినిమా నటీమణి, గాయని.
ఈమె 1937 సంవత్సరం జగ్గంపేటలో జన్మించారు. అలనాటి తెలుగు కథానాయిక, సత్యహరిశ్చంద్రలో చంద్రమతిగా, లవకుశలో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు అలరించాయి. తన పాత్రకు తానే పాటలు పాడుకునే ఆమె కంఠస్వరం పాతతరపు ప్రేక్షకులకు సుపరిచితమే. వయ్యారి భామలు వగలమారి భర్తలు, ముద్దుల కృష్ణయ్య తదితర పలు తెలుగు చిత్రాలతో పాటు వీరపాండ్య కట్టబొమ్మన్, పణమా పాశమా, గుణ వంటి ప్రఖ్యాత తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించారు.
యస్.వరలక్ష్మి గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో బాలనటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రం ‘బాలయోగిని’ (1937) తర్వాత ‘రైతుబిడ్డ’ (1939)లో పి.సూరిబాబు కూతురుగా నటించింది. ‘ఇల్లాలు’లో ఆమె పాడిన ‘కోయిలోకసారొచ్చి కూసిపోయింది’ పాటతో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. ఎస్.రాజేశ్వరరావుతో కలిసి ‘శాంత బాలనాగమ్మ’ (1942)లో నటించింది. ఆ సినిమాలో రాజేశ్వరరావుతో కలిసి పాడిన పాటలు ఈనాడు లభించటం లేదు. తర్వాత ‘మాయాలోకం’ (1945)లో నటించినా ఆంధ్రలోకానికి బాగా తెలిసింది ‘పల్నాటి యుద్ధం’ చిత్రంతోనే. ఈ చిత్రంలోని పాటల్ని మద్రాసు ఆలిండియా రేడియో వారు రికార్డింగ్ అయిన మరుసటి రోజే ప్రసారం చేశారు.
More About : S. Varalakshmi
ఎస్.వరలక్ష్మి క్విజ్