బులుసు సాంబమూర్తి
Bulusu Sambamurti - Quiz
Bulusu Sambamurti – Quiz :
బులుసు సాంబమూర్తి (1886 – 1958) దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. భారతదేశ స్వాతంత్ర్యం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర అనే పరమ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేసిన కార్యశూరుడు. ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు.
ఈయన తూర్పు గోదావరి జిల్లా, దుళ్ల గ్రామంలో 1886, మార్చి 4 న జన్మించారు. ఈయన తండ్రి సుబ్బావాధానులు వేదపండితుడు. కుటుంబమంతా దానధర్మాలు చేస్తూ ధార్మిక జీవనం సాగించేవారు.
మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులై, విజయనగరం మహారాజా కళాశాలలో కొంతకాలం భౌతిక శాస్త్రం బోధించారు.
స్వేచ్ఛా స్వభావి అయిన సాంబమూర్తికి ఈ ఉద్యోగం అంతగా నచ్చలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి న్యాయవాద వృత్తి చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. తరువాత బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై 1911లో కాకినాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
మహాత్మా గాంధీ పిలుపునందుకొని న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నారు . వీరు 1919లో హోంరూల్ ఉద్యమంలోను, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోను, 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోను, నీల్ సత్యాగ్రహంలోను పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు.
1927లో నాగపూరు పతాక సత్యాగ్రహ దళానికి నాయకులుగాను, 1928లో హిందూస్థానీ సేవాదళానికి అధ్యక్షులుగాను పనిచేశారు.
More About : Bulusu Sambamurti
బులుసు సాంబమూర్తి క్విజ్