దాసరి రామతిలకం
Dasari RamaTilakam
Dasari RamaTilakam – Quiz : దాసరి రామతిలకం (1905-1952) సంగీత, నృత్య కళాకారిణి, రంగస్థల నటి, తొలి తరపు తెలుగు సినిమా నటి. తొలినాటి సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ నటి గిరిజ ఈమె కుమార్తె. రామతిలకం చింతామణి చిత్రంలో చింతామణి పాత్రను పోషించారు. తెలుగు తెరపై వేశ్య పాత్ర పోషించిన తొలి కథానాయిక ఈమే.
ఆమె నివాసస్థలం బెజవాడ. ఆమె తండ్రి ఆంధ్ర దేశంలో మృదంగ వాద్యమునందు ప్రసిద్ధిగాంచినవారిలో నొకరగు పువ్వుల పెంకటరత్నం గారు. స్వజాతీయుడగు పువ్వుల నారాయణగా వద్ద ఈమె సంగీతం నేర్చుకున్నది. సంగీతంలో కచ్చేరిచేయుటకు తగినంత జ్ఞానం సంపాదించింది. కొన్నిచోట్ల కచ్చేరీలు కూడా చేసి బహుమతులు పొంది ప్రశంసింపబడ్డది.
More About : Dasari RamaTilakam
దాసరి రామతిలకం క్విజ్