తెలుగు ఇజం = మన భాష + మన నైజం

ప్రగడ కోటయ్య

Pragada Kotaiah

TeluguISM Quiz - Pragada Kotaiah
0 178

Pragada Kotaiah – Quiz : ప్రగడ కోటయ్య ( 1915జూలై 26 – 1995నవంబరు 26) ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు, చేనేత పరిశ్రమ రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు.

ప్రగడ కోటయ్య గుంటూరు జిల్లా, నిడుబ్రోలులో చేనేత వృత్తి చేసుకొనే ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు 1915, జూలై 26న రెండవ కుమారుడుగా జన్మించాడు. ఇతడికి ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీ మణులు. 1931లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ స్కూలు ఫైనల్‌ ప్యాసయ్యాడు. కొంతకాలం బాపట్ల తాలూకా బోర్డులో ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేసాడు. ఇతడి కుటుంబం చీరాల ఈపురుపాలెంలో కొంతకాలం నివాసం ఉంది. ఇతడి వివాహం ఇందిరాదేవితో జరిగింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు.

ఆక్స్ ఫర్డు విశ్వవిద్యాలయంలో భారతీయ చేనేత పరిశ్రమ పై పరిశోధన జరిపిన ఆచార్య ఎన్ జి రంగా సలహా మేరకు మద్రాసు లోని టెక్స్‌టైల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదివి అక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేసాడు. ఇదే అనుభవంతో 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జిగా ఉద్యోగంలో చేరి సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేశాడు.

 

More About : Pragada Kotaiah

 

ప్రగడ కోటయ్య క్విజ్

0%
0 votes, 0 avg
2

Quiz : ప్రగడ కోటయ్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Pragada Kotaiah - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ప్రగడ కోటయ్య ఏ నియోజకవర్గం నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు ?

2. ప్రగడ కోటయ్య ఏ సంవత్సరంలో కాంగ్రెసు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ?

3. ఏ సంవత్సరంలో ప్రగడ కోటయ్య చేనేతలకు ప్రత్యేకంగా టెక్స్‌టైల్స్ ఉత్పత్తి రంగాలను సిఫార్సు చేయడానికి ప్రభుత్వం

నియమించిన ప్రత్యేక కమిటీ సభ్యుడు గా నియమితుడయ్యాడు ?

4. క్రింది వారిలో ప్రజాబంధు బిరుదాంకితులు ఎవరు ?

5. ప్రగడ కోటయ్య ఏ పత్రిక ద్వారా చేనేతల సమస్యలను రాష్ట్రమంతటా వినిపించాడు ?

6. ప్రగడ కోటయ్య ఆల్ ఇండియా హ్యాండ్ లూమ్ బోర్డు సభ్యుడు గా ఏ సంవత్సరంలో నియమితుడయ్యాడు ?

7. ఏ సంవత్సరంలో ప్రగడ కోటయ్య ఆల్ ఇండియా హ్యాండ్-లూమ్ వీవర్స్ కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు ?

8. ఎక్కడ స్థాపించినబడిన ఆల్ ఇండియా హ్యాండ్-లూమ్ వీవర్స్ కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శిగా ప్రగడ కోటయ్య నియమితుడయ్యాడు ?

9. ప్రగడ కోటయ్య ఏ సంవత్సరంలో పార్లమెంటు రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికయ్యారు ?

10. ప్రగడ కోటయ్య ఎవరి చేత ఆల్ ఇండియా హ్యాండ్-లూమ్ వీవర్స్ కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : చండ్ర రాజేశ్వరరావు

Leave A Reply

Your Email Id will not be published!