నివర్తి వెంకటసుబ్బయ్య
Nivarthi Venkata Subbaiah
Nivarthi Venkata Subbaiah- Quiz : ఎన్.వెంకటసుబ్బయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి మద్రాసురాష్ట్ర మాజీ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ అధ్యక్షుడు.
నివర్తి వెంకటసుబ్బయ్య 1910, నవంబర్ 24వ తేదీ కర్నూలు జిల్లా, పత్తికొండలో జన్మించాడు.. ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టా పొందాడు. మహాత్మా గాంధీ పిలుపును అందుకుని ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యునిగా టంగుటూరి ప్రకాశం, పట్టాభి సీతారామయ్య, బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య వంటి నాయకులతో కలిసి పనిచేశాడు.
1940లో కర్నూలులో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని 8 నెలలు అల్లీపురం, వెల్లూరు జైళ్ళలో కఠిన కారాగార శిక్షను అనుభవించాడు. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాడు. విద్యార్థులతో కాంగ్రెస్ సభ్యులతో రహస్య దళాలను ఏర్పాటు చేశాడు. 1942లో విప్లవోద్యమాన్ని నడిపించడానికి విధి విధానాలను నిర్దేశిస్తూ ఇతడు రూపొందించిన సర్క్యులర్‌ను బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. ఇతడిని అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తర్వాత గాంధీజీ సలహా మేరకు ఇతడు లొంగిపోయాడు.
More About : Nivarthi Venkata Subbaiah
నివర్తి వెంకటసుబ్బయ్య క్విజ్