Digavalli Venkata Siva Rao
Digavalli Venkata Siva Rao Quiz
Digavalli Venkata Siva Rao Quiz : దిగవల్లి వేంకటశివరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫిబ్రవరి 14 1898 న నియోగి బ్రాహ్మణులైన వెంకటరత్నం, సూర్యమాణిక్యాంబ దంపతులకు జన్మించారు. శివరావుగారు కాలికట్లో ఫస్టు ఫారం చదువుతూవుండగా వారి బావగారికి బదలీ కావడంవల్ల ఫస్టు ఫారం బెంగళూరులో తిరిగి చదవటం ప్రారంభించారు. కాని మళ్ళీ బదిలీ అవుటవల్ల 1910 లో రాజమండ్రి వచ్చేసి అక్కడ మళ్లీ ఫస్టు ఫారం చేరి అక్కడనుండి నుండి ఎస్.ఎస్.ఎల్.సి దాకా వీరెశలింగం పాఠశాలలో చదివారు.
1916 లో మద్రాసు ప్రెసిడెన్సీలో కళాశాలలో ఇంటర్మీడియట్, బి.ఎ ( 1918 -1920) తరువాత న్యాయ కళాశాలలో బి.యల్ ( 1920-1922) మద్రాసు లోనే పూర్తిచేసి 1922 నుండి విజయవాడలో ప్రముఖ న్యాయవాదిగా ప్రసిధ్ధి చెందారు. వారు న్యాయశాస్త్ర చదువులో జేరేటప్పటికే గాంధీగారు నిరాకరణోద్యమం మొదలైయుండుటయూ దేశ స్వాతంత్ర్య సాధన వారి మనస్సులో బలమైన ఆందోళన కలుగజేసినట్లునూ అతికష్టముమీద వారు న్యాయశాస్త్ర చదువు బి.యల్ పూర్తిచేయుట జరిగినట్లు వారు 1966 లో తనకు జరిగిన సన్మాన సభలో చెప్పారు.
More About : Digavalli Venkata Siva Rao
దిగవల్లి వేంకటశివరావు క్విజ్