Rajasulochana
Rajasulochana - Quiz
Rajasulochana – Quiz :
రాజసులోచన (ఆగష్టు 15, 1935 – మార్చి 5, 2013) అలనాటి తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరత నాట్య నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు భార్య. ఈమె విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది, కానీ విద్యాభ్యాసం అంతా తమిళనాడులో జరిగింది.
రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడుకు మద్రాసుకు బదలీ కావడంతో, రాజసులోచన చిన్న వయసులోనే అక్కడకు వెళ్ళిపోయారు. చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. అక్కడి తోపు వెంకటాచలం చెట్టి వీధిలో 1939లో స్థాపించిన ప్రసిద్ధ శ్రీసరస్వతీ గాన నిలయంలో ఆమె నాట్యం నేర్చుకున్నది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి సరస్వతీ గాన నిలయంలో నాట్యం నేర్చుకున్నది. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించింది. అది ఇప్పటికీ నడుస్తున్నది.
More About : Rajasulochana
రాజసులోచన క్విజ్