Gottipati Brahmaiah
Gottipati Brahmaiah - Quiz
Gottipati Brahmaiah – Quiz :
గొట్టిపాటి బ్రహ్మయ్య గారు కృష్ణా జిల్లాలోని చినకళ్ళేపల్లి లో1889 డిసెంబరు 3 న జన్మించారు. 1917లో, యుక్తవయసులోనే ఆయన గ్రంథాలయోద్యమము, వయోజన విద్యలపై దృష్టి సారించారు. 1922-23లో జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా పనిచేసారు. 1923-29లో కృష్ణా జిల్లా ఖాదీ బోర్డుకి అధ్యక్షునిగా ఉన్నారు.
స్వాతంత్ర్య సమర యోధునిగా ఆయన జమీందార్ రైతు ఉద్యమంలో ఆచార్య ఎన్.జి.రంగా గారితో కలసి పాల్గోన్నారు,”సైమన్ కమిషను” బహిష్కరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం మున్నగు పలు కార్యక్రమాలలో పాలుపంచుకుని, పెక్కు దినాలు జైలుపాలయ్యారు.
More About : Gottipati Brahmaiah
గొట్టిపాటి బ్రహ్మయ్య క్విజ్