Mikkilineni Radhakrishna Murthy
Mikkilineni Radhakrishna Murthy - Quiz
Mikkilineni Radhakrishna Murthy – Quiz : మిక్కిలినేని గా పేరొందిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 – ఫిబ్రవరి 22, 2011) తెలుగు రంగస్థల, సినిమా నటులు, రచయిత. మన జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు.
స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను ‘నటరత్నాలు’ శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.1949లో కేఎస్ ప్రకాశ రావు దీక్షతో మొదలై బాలకృష్ణ సినిమా భైరవద్వీపం వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు.
More About : Mikkilineni Radhakrishna Murthy
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి క్విజ్
Also Read : సి.యస్.ఆర్. ఆంజనేయులు క్విజ్