అయ్యదేవర కాళేశ్వరరావు
Ayyadevara Kaleswara Rao - Quiz
Ayyadevara Kaleswara Rao – Quiz : అయ్యదేవర కాళేశ్వరరావు (జనవరి 22, 1881 – ఫిబ్రవరి 26, 1962) స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి శాసనసభాధిపతి. ఈయన జీవిత చరిత్ర నవ్యాంధ్రము నా జీవిత కథ అనే పుస్తక రూపంలో వెలువడింది.
1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో బి.ఎల్. పరీక్షలో నెగ్గి 1906లో విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.
రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను వీరు పనిచేశారు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.
రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిలో కార్యదర్శిగా పనిచేశారు.
వీరు కారాగారంలో ఉండగా ‘ఫ్రెంచి విప్లవ చరిత్ర’, ‘అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర’, ‘తురుష్క ప్రజాస్వామికం’, చీనా జాతీయోద్యమ చరిత్ర’, ‘ఈజిప్టు చరిత్ర’ అను పుస్తకాలను రచించారు.
1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రజా ప్రతినిధిగా వీరు విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వీరు ఎంతోమందికి విద్యాదానము చేసారు. ఈయన విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
More About : Ayyadevara Kaleswara Rao
అయ్యదేవర కాళేశ్వరరావు క్విజ్
Read More : కాశీనాథుని నాగేశ్వరరావు