తెలుగు ఇజం = మన భాష + మన నైజం

బొమ్మిరెడ్డి నరసింహరెడ్డి

B. N. Reddy - Quiz

TeluguISM Quiz - B.N.Reddy
0 123

B. N. Reddy – Quiz : బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి) (నవంబర్ 16, 1908 – నవంబర్ 8, 1977) సినీ దర్శక నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం.

బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. పద్మ భూషణ్ పురస్కార గ్రహీత(B N Reddy).

తండ్రి వ్యాపార రీత్యా మద్రాసులో పెరిగిన బి. ఎన్. చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో వేషాలు వేసేవాడు. వరవిక్రయం నాటకంలో ఆయన ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన గాంధీజీ ఆయన్ను ప్రత్యేకంగా ప్రశంసించాడు.

చదువు పూర్తయ్యాక బి. ఎన్. రంగూన్ వెళ్ళి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. అయితే అప్పట్లో ఉధృతంగా సాగుతున్న స్వదేశీ ఉద్యమ ప్రభావం వల్ల విదేశీ వ్యాపారం చేసే ఆలోచన మానుకుని కలకత్తా వెళ్ళి శాంతినికేతన్లో కొంత కాలం గడిపాడు.

అక్కడ ఆయన లలిత కళల పట్ల విశేషంగా ఆకర్షితుడయ్యాడు. రంగూన్లో ఉన్న రోజుల్లో అక్కడి జానపద కళా రూపాలను, వీధి ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీంచాడు. ఆ అనుభవాల ఫలితంగా ఆయన తిరిగి వచ్చాక చలన చిత్ర రంగం వైపు మొగ్గు చూపాడు. ముఖ్యంగా ప్రసిద్ధ బెంగాలీ దర్శకుడు దేవకీబోస్ తీసిన ‘సీత’ చిత్రం చూశాక తనకు సినిమాలు తీయాలనే కోరిక కలిగిందని బి.ఎన్. చెబుతుండే వాడు.

బి.ఎన్.రెడ్డి తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద(1931) దర్శకుడైన హెచ్.ఎమ్.రెడ్డి, నటి కన్నాంబ లతో కలిసి 1938లో రోహిణి పిక్చర్స్ స్థాపించి ‘రంగూన్ రౌడీ’ అనే స్టేజి నాటకం ఆధారంగా గృహలక్ష్మి చిత్రాన్ని ప్రారంభించాడు.

మద్యపానం, వేశ్యావ్యామోహం వల్ల కలిగే నష్టాలు, పాతివ్రత్య సంప్రదాయంలోని గొప్పదనం గురించి తీసిన ఈ చిత్రానికి హెచ్.ఎమ్.రెడ్డి దర్శకనిర్మాత కాగా, బి.ఎన్.రెడ్డి(B N Reddy) సహాయ దర్శకుడు, సహ నిర్మాత. దురదృష్ట వశాత్తూ చిత్ర రంగంలో తన తొలి అడుగైన ‘గృహలక్ష్మి’ లోనే దర్శకుడు ఒక “రసవత్తరమైన” దృశ్యం తీయబూనడంతో బి.ఎన్.

ఆయనతో తెగతెంపులు చేసుకుని బయటికొచ్చేశాడు.(హీరో అయిన డాక్టరును వలలో వేసుకునే ఉద్దేశంతో ఒక జాణ ‘అబ్బా, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి’ అంటూ తన ఒంట్లోని వివిధ భాగాలను ఆ డాక్టరు చేత తడిమించుకునే ఆ దృశ్యం కాంచనమాల, నాగయ్యల మధ్య చిత్రించబడింది.

 

More About B. N. Reddy

బొమ్మిరెడ్డి నరసింహరెడ్డి క్విజ్

0%
0 votes, 0 avg
1

Quiz : బొమ్మిరెడ్డి నరసింహరెడ్డి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

B. N. Reddy - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు ఎవరు ?

2. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తీసిన ఏ సినిమా బహుళ ప్రజాదరణ పొందినది ?

3. బి.ఎన్.రెడ్డి గారికి గల బిరుదులేవి ?

4. బాల్యవివాహాలను నిరసిస్తూ, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహిస్తూ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తీసిన సినిమా ఏది ?

5. ఏ సంవత్సరంలో బి.ఎన్.రెడ్డిను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది ?

6. మల్లీశ్వరి చలనచిత్రం ద్వారా బి.ఎన్.రెడ్డి చిత్రరంగానికి ఏ ప్రముఖ కవిని పరిచయం చేశాడు?

7. నాగయ్య నటన తారాస్థాయి చేర్చీ ఆయనను తెలుగులో తొలి మెగాస్టార్ గా చేసిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి సినిమాలేవి ?

8. బీనాదేవి రాసిన ఏ నవలను బి.ఎన్.రెడ్డి సినిమగా తీయలనుకున్నాడు ?

9. బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి తీసిన ఏ సినిమాలో నాగయ్య నటన చూసి "పాల్‌ముని ఆఫ్‌ ఇండియా" అంటూ నాగయ్య గురించి బాబురావు పటేల్‌ ఫిలిం ఇండియా పత్రికలో రాసారు?

10. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు అనే పాట బి.ఎన్.రెడ్డి తీసిన ఏ సినిమాలోదీ ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

 

Also Read : రేలంగి

Leave A Reply

Your Email Id will not be published!