బి. నాగిరెడ్డి
B. Nagi Reddy - Quiz
B. Nagi Reddy – Quiz : బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (డిసెంబర్ 2, 1912 – ఫిబ్రవరి 25, 2004) తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.మొదట్నుంచి నాగిరెడ్డికి పబ్లిసిటీ విభాగం పట్ల ఆసక్తి ఉండేది. ఆయన తన అన్నగారైన బి.ఎన్.రెడ్డి స్థాపించిన వాహినీ సంస్థలో భాగస్వామిగా చేరాడు. రెండవప్రపంచయుద్ధ కాలంలో (1941లో) వాళ్ళ సరుకు తీసుకువెళ్తున్న ఓడ బాంబుదాడిలో ధ్వంసం కావడంతో పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది.
ఆ పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించలేక తన స్వగ్రామమైన ఓరంపాడు చేరాడు. ఆ తర్వాత వాహినీ వారి భక్తపోతనకు దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి నాగిరెడ్డిని మద్రాసుకు పిలిపించి ఆ చిత్రం తాలూకు పబ్లిసిటీ వ్యవహారాలు అప్పజెప్పాడు. సరిగ్గా అదే సమయంలో జెమినీ వారి బాలనాగమ్మ విడుదలైంది. జెమినీ వారు తమ చిత్రాలకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
తర్వాత 1950లో నిర్మాతగా మారి చక్రపాణితో కలిసి విజయా ప్రొడక్షన్స్ స్థాపించాడు. ఉన్నతమైన ప్రమాణాలతో పండితపామర జనరంజకంగా సినిమాలు తీసిన విజయా సంస్థ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించింది. 1950లో వచ్చిన షావుకారుతో మొదలైన ప్రస్థానం 1962లో వచ్చిన గుండమ్మ కథ వరకు ఉచ్ఛస్థితిలో కొనసాగింది.
More About : B. Nagi Reddy
బి.నాగిరెడ్డి క్విజ్