బెజవాడ గోపాలరెడ్డి
Bezawada Gopala Reddy
Bezawada Gopala Reddy – Quiz : స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి (ఆగష్టు 7, 1907 – మార్చి 9, 1997). పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్కు గవర్నరు గాను, రాజ్యసభ సభ్యుడు (1958-1962) గా కూడా పనిచేసాడు.
జాతీయోద్యమంలో పాల్గొని చెరసాలల్లో సంవత్సరాల తరబడి గడిపారు. ముప్పయి సంవత్సరాలు నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అప్పటికింకా ఆయన అవివాహితుడు. తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను మంత్రిగా వివాహమాడారు. కర్నూలులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రి అయ్యాఅరు. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ కేంద్రంలో మంత్రిగా ఆహ్వానించి రెవిన్యూ మంత్రిని చేశారు.
More About : Bezawada Gopala Reddy
బెజవాడ గోపాలరెడ్డి క్విజ్