C. S. R. Anjaneyulu
C. S. R. Anjaneyulu - Quiz
C. S. R. Anjaneyulu – Quiz :
చిన్నప్పటి నుండి నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చినా నాటకరంగాన్నే ఆయన ఉపాధిగా ఎంచుకున్నారు. రంగస్థలంపై కృష్ణుడుగా, శివుడుగా, రామునిగా నటించడమే గాకుండా తన గాత్రమాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేవారు. రామదాసు, తుకారాం, సారంగధర వంటి ఎన్నో భిన్నమైన పాత్రలను నాటకరంగంపైనే ఆలవోకగా నటించి వాటికిజీవం పోశారు. ఆంగికం, వాచకం, అభినయం మూర్తీభవించిన వ్యక్తి సి.యస్.ఆర్. స్థానం నరసింహారావు తో సమ ఉజ్జీ అన్న ప్రశంశలు అందుకున్న నటుడు – ఇటు రంగస్థలం మీదా, అటు వెండి తెర మీదా. పదకొండేళ్ళ వయస్సులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు.
ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ 1933లో నిర్మించిన రామదాసులో ఆయనే హీరో. ద్రౌపదీ వస్త్రాపహరణం (1936)లో శ్రీకృష్ణునిగా నటించారు. సారథీ వారి గృహప్రవేశం (1946) చిత్రం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఎల్.వి.ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో కామెడీ విలన్ పాత్రలో ఆయన నటించారు అని చెప్పే కన్నా జీవించారని చెప్పడమే సబబు. మైడియర్ తులసమ్మక్కా అంటూ అక్కను బుట్టలో వేసుకునే పాత్రలో ఆయన నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది.
More About : C. S. R. Anjaneyulu
సి.యస్.ఆర్. ఆంజనేయులు క్విజ్