తెలుగు ఇజం = మన భాష + మన నైజం

చిత్తూరు నాగయ్య

Chittor V. Nagaiah

TeluguISM Quiz - Chittor V. Nagaiah
0 135

Chittor V. Nagaiah – Quiz : చిత్తూరు నాగయ్య (మార్చి 28, 1904 – డిసెంబరు 30, 1973) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. అతను ధరించిన పోతన, త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు బహుళ ప్రజాదరణ పొందాయి. దక్షిణభారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు నాగయ్య.

336 కి పైగా సినిమాల్లో నటించాడు. 1938 లో వచ్చిన గృహలక్ష్మి చిత్రంతో అతను సినీ రంగ ప్రస్థానం ప్రారంభమైంది. 1939లో స్థాపించబడిన వాహినీ స్టూడియోస్ తరపున నాగయ్య పలు సినిమాలకు వివిధ విభాగాల్లో పనిచేశాడు. తర్వాత తానే రేణుకా ఫిల్మ్స్ అనే పేరుతో స్వంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు రూపొందించాడు. తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడిగా పేరు గాంచాడు. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి.

నాగయ్య చిత్తూరులో ఉండగా సురభి నాటక మండలి వారు భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించడానికి వచ్చారు. అయితే ఆ నాటకంలో ప్రహ్లాదుడి వేషం వేయవలసిన అబ్బాయికి జ్వరం రావడంతో నాగయ్య తొలిసారిగా నాటకంలో ప్రహ్లాదుడి వేషం వేశాడు. ఆ అర్థరాత్రి నాటకంలో మొదట వేదిక ముందున్న జనవాహినిని చూసి భయపడి ఏడ్చేసినా తర్వాత సర్దుకుని మళ్ళీ పద్యాలు, పాటలు ఆలపించాడు. ప్రేక్షకులు, బంధువులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు. ఇది విన్న పాఠశాల పంతుళ్ళు కూడా నాగయ్యను ప్రత్యేకంగా స్కూల్లో కూడా ప్రహ్లాదుడి వేషం వేసి పాఠలు, పద్యాలు పాడించి ఆనందించారు. తర్వాత స్కూల్లోనూ, ఉత్సవాల్లోనూ అప్పుడప్పుడూ వేదికలెక్కి పాటలు పాడుతుండటంతో నటన భాగా అనుభవంలోకి వచ్చింది.

 

More About : Chittor V. Nagaiah

చిత్తూరు నాగయ్య క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : చిత్తూరు నాగయ్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Chittor V. Nagaiah - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నగరంలో ఉంది ?

2. ఏ సంవత్సరంలో నాగయ్యను పద్మశ్రీ అవార్డు వరించినది ?

3. చిత్తూరు నాగయ్య ఎప్పుడు జన్మించారు ?

4. చిత్తూరు నాగయ్య ఏ సాదుకవుల పాత్రలో నటించారు ?

5. మొదటిసారి లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి తెలుగు నటుడు ?

6. చిత్తూరు నాగయ్యలోని రచయితను పరిచయం చేసిన సినిమా ఏది ?

7. చిత్తూరు నాగయ్య నిర్మించిన సినిమా నిర్మాణ సంస్థ ఏది ?

8. చిత్తూరు నాగయ్య జర్నలిస్టుగా పనిచేసిన పత్రిక ?

9. " ఆంధ్రా పాల్‌మునిగా " కీర్తించబడినవారు ?

10. చిత్తూరు నాగయ్య ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాకు చెందినవారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : మద్దెల నగరాజకుమారి

Leave A Reply

Your Email Id will not be published!