డా.దగ్గుబాటి రామనాయుడు
Daggubati Ramanaidu - Quiz
Daggubati Ramanaidu – Quiz : డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (జూన్ 6, 1936 – ఫిబ్రవరి 18, 2015) తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు.
ఇతను 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు.
అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ సదుపాయాలు,
డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్ సభ్యునిగానూ రాణించాడు.
రామానాయుడు 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2010 సెప్టెంబరు 9న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది.
2015 ఫిబ్రవరి 18న హైదరాబాదులో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు.
More About : Daggubati Ramanaidu
డా.దగ్గుబాటి రామనాయుడు క్విజ్
Read More : ఎస్.వి. రంగారావు