దాసరి గిరిజ
Dasari Girija
Dasari Girija – Quiz : గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల, సినిమా నటి దాసరి రామతిలకం. 1936లో కంకిపాడులో పుట్టిన గిరిజ, గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది.
కస్తూరి శివరావుకు ఈమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా, ఆ సినిమాతో రేలంగి పరిచయమయ్యాడు. ఆయన ప్రయత్నంతోనే పాతాళభైరవిలో అవకాశం వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. గిరిజ 1950, 60వ దశకంలో హీరో, హీరోయిన్‌లతో సమానంగా గుర్తింపు పొందింది.
1950 – 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. కస్తూరి శివరావు నిర్మించిన పరమానందయ్య శిష్యులు చిత్రంతో అక్కినేని నాగేశ్వరరావు సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత పాతాళభైరవి చిత్రంలోని ‘నరుడా ఏమి నీ కోరిక’ అనే ఒకే ఒక్క పలుకుతో కథానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు రేలంగితో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. అన్నపూర్ణ, గుడిగంటలు, అప్పుచేసి పప్పుకూడు, జగదేకవీరుని కథ, ఆరాధన వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
More About : Dasari Girija
దాసరి గిరిజ క్విజ్