తెలుగు ఇజం = మన భాష + మన నైజం

బాపు

Director Bapu - Quiz

TeluguISM Quiz - Director Bapu
0 304

Director Bapu : బాపు (డిసెంబరు 15, 1933 – ఆగష్టు 31, 2014) తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు.

ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. బాపు బొమ్మ’ అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధి గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది.

ఇలా కూనలమ్మ పదం వ్రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతివ్రాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది.

అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు.ఆయనకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. 1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో ఐదు, ఆరు తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, ముళ్ళపూడి వెంకటరమణల మధ్య స్నేహం పరిమళించింది. అది చివరి వరకూ కొనసాగింది.

బాపు బొమ్మ ప్రత్యేకమైనది. ఆయన రాత కూడా అంతే. బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు… కానీ ఆ బొమ్మలపై రాత కూడా బాపు అక్షరాలే అని రమణ చెప్పేవరకూ చాలా మందికి తెలీదు. రమణ రాత, బాపు గీతలో వెలువడ్డ ‘కోతికొమ్మచ్చి’ ‘బుడుగు’లు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు.

దర్శకుడిగా బాపు మొదటి చిత్రం సాక్షి. తరువాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండితెరపై సృష్టించారు. అందులో ‘ముత్యాలముగ్గు’ సినిమాను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపొయాయనటం పొగడ్త కాదు.

క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు.

 

More About : Director Bapu 

బాపు క్విజ్

0%
0 votes, 0 avg
5

Quiz : బాపు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Director Bapu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఏ విశ్వవిద్యాలయం బాపుకు కళాప్రపూర్ణ ప్రధానం చేసింది?

2. బాపూ నీ బొమ్మలు-తల

లూపు గులాబి  కొమ్మలు

బాపూ నీ రేఖలు - ముని

మాపు శకుంతల లేఖలు

బాపూ నీ లేఖిని - దరి

దాపు సుధారస వాహిని

బాపూ నీ భావము - వగ

బాపు కళకు నవ జీవనము  అని బాపు గురించి వర్ణించినది ?

3. బాపు ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ?

4. బుడుగు పుస్తక రచయిత ?

5. బాపు ఏ సంవత్సరంలో చిత్ర దర్శకుడిగా ఫిల్మ్ ఇండస్ర్టీలో అడుగుపెట్టాడు ?

6. బాపు ఏ సంవత్సరంలో చిత్రదర్శకునిగా సినిమారంగంలోకి అడుగుపెట్టారు ?

7. ఏ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం బాపుకు కళాప్రపూర్ణ ప్రధానం చేసింది?

8. బాపు ఏ సంవత్సరంలో పిల్లలకోసం రామాయణాన్ని తనదైనశైలిలో బొమ్మలతో చెప్పారు ?

9. బాపు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ?

10. బాపు ఏ భాషలలో పిల్లలకోసం రామాయణాన్ని తనదైనశైలిలో బొమ్మలతో చెప్పారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : కొంగర జగ్గయ్య

 

Leave A Reply

Your Email Id will not be published!