తెలుగు ఇజం = మన భాష + మన నైజం

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

Dr. Sarvepalli Radhakrishnan

TeluguISM Quiz - Dr. Sarvepalli Radhakrishnan
0 181

Dr. Sarvepalli Radhakrishnan – Quiz : డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, (1888 సెప్టెంబరు 5 – 1975 ఏప్రిల్ 17) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.

 

సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5 న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరంలో ఉన్న తిరుత్తణిలో తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగుదంపతులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు.

21 సంవత్సరాలైనా దాటని వయసులో అతను మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.వి.నంజుండయ్య రాధాకృష్ణన్ తత్వశాస్త్రంలో ప్రతిభను గుర్తించి, పిలిపించుకుని ప్రొఫెసరుగా నియమించాడు. అతను ఉపన్యాసాలను విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. దాంతో అతను కలకత్తా వెళ్ళాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు అతను ‘భారతీయ తత్వశాస్త్రం’ అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకుంది.

  • ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు, గౌరవానికిగాను ప్రతీ సంవత్సరం అతను పుట్టిన రోజును సెప్టెంబరు 5 ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
  • 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు ఇతనును వరించింది.

 

More About : Dr. Sarvepalli Radhakrishnan 

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ క్విజ్ 

0%
1 votes, 1 avg
1

Quiz : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Dr. Sarvepalli Radhakrishnan - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌గా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ సంవత్సరంలో ఎన్నికయ్యారు?

2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఎప్పటి నుంచి నిర్ణయించారు?

3. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఎప్పుడు లభించింది?

4. భారతదేశ 2వ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు?

5. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తూర్పు మతాలు మరియు నీతిశాస్త్రాల ప్రొఫెసర్‌గా ఎప్పుడు నియమించారు?

6. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చైర్మన్‌గా ఉన్న విద్యా కమిషన్ పేరు ఏమిటి ?

7. డాక్టర్ రాధాకృష్ణన్ ఏ సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు?

8. భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు?

9. కింది వాటిలో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు అత్యున్నత పౌర పురస్కారం ఏది లభించింది?

10. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ సంవత్సరంలో జన్మించారు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

Leave A Reply

Your Email Id will not be published!