గుమ్మడి వెంకటేశ్వరరావు
Gummadi Venkateswara Rao
Gummadi Venkateswara Rao Quiz :
తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జూలై 9, 1927 – జనవరి 26, 2010) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత.
ఇతను 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
చలనచిత్రాల మీద గుమ్మడి వెంకటేశ్వరరావుకు ఉన్న విపరీతమైన మోహానికి మాధవపెద్ది వెంకటరామయ్య మాటలు తోడయ్యాయి. ఆసమయంలో అతను తోడల్లుడు వట్టికూటి రామకోటేశ్వర రావు, అతను మీద ఉన్న అభిమానంతో, తెనాలిలో, ఆంధ్రా రేడియోస్ అండ్ ఎలెక్ట్రానిక్స్ అనే షాపు పేరుతో వ్యాపారం పెట్టించాడు. వ్యాపారం పెట్టినా, నటనా వాసనలు అతనును వదలని కారణంగా షాపు నాటక సమాజానికి కార్యాలయంగా మారింది. వ్యాపారం నష్టాలను చవి చూసింది. కుటుంబం ఇద్దరు పిల్లల వరకు పెరిగింది.
తెనాలిలో అతనును కలసిన సహవిద్యార్థిమల్లిఖార్జునరావు చలనచిత్రాలలో నటించమని సలహా ఇచ్చాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు తొలి సారిగా చలనచిత్ర నటనాభిలాషతో, మల్లిఖార్జునరావుతో కలిసి మద్రాసుకు ప్రయాణం చేసాడు. మద్రాసులో కె.ఎమ్.రెడ్డి, హె.ఎమ్.రెడ్డి వంటి వారిని కలిసి అవకాశం కొరకు అర్ధించి చూసాడు. వారు అతనుకు సుముఖమైన సమాధానం ఇవ్వక పోవడంతో తిరిగి తెనాలి వెళ్ళి యధావిధిగా జీవితం సాగించాడు.
More About : Gummadi Venkateswara Rao
గుమ్మడి వెంకటేశ్వరరావు క్విజ్