కల్లూరి సుబ్బరావు
Kallur Subba Rao
Kallur Subba Rao Quiz : కల్లూరు సుబ్బారావు (1897 – 1973), అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త, కవి. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920లలో స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు.
సుబ్బారావు, అనంతపురం జిల్లా, హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897, మే 25న సూరప్ప, పుట్టమ్మ దంపతులకు జన్మించాడు. మదనపల్లెలోని జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. 17 ఏళ్ల వయసులో అనీబిసెంట్ ప్రసంగాన్ని విని, ఉత్తేజితుడై, జాతీయోద్యమంలో పాల్గొనటం ప్రారంభించాడు.
స్వాతంత్ర్యం తర్వాత మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1955లో ఆంధ్రరాష్ట్ర శాసనసభకు, 1965లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు.
More About : Kallur Subba Rao
కల్లూరి సుబ్బరావు క్విజ్